Pushpa 2 Reloaded Version: తగ్గేదేలే.. ఓటీటీలోకి వచ్చేసిన పుష్ఫ2.. రీ లోడెడ్‌కు మరి కొన్ని సీన్లు జత!
గతేడాది డిసెంబర్ 5న విడుదలైన పుష్ప2 బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. సినిమా విడుదలై దాదాపు రెండు నెలలు కావస్తున్నప్పటికీ చాలాచోట్ల కలెక్షన్లు రాబడుతోంది.

తగ్గేదేలే.. ఓటీటీలోకి వచ్చేసిన పుష్ఫ2.. రీ లోడెడ్‌కు మరి కొన్ని సీన్లు జత!
Pushpa 2 Reloaded Version: అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప2 మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. రూ.1890 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి దంగల్ తర్వాత అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన భారతీయ సినిమాగా నిలిచింది. ఇక ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డుల వేటకు సిద్ధమైంది.
గతేడాది డిసెంబర్ 5న విడుదలైన పుష్ప2 బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. సినిమా విడుదలై దాదాపు రెండు నెలలు కావస్తున్నప్పటికీ చాలాచోట్ల కలెక్షన్లు రాబడుతోంది. ముఖ్యంగా సంక్రాంతి తర్వాత థియేటర్‌లలో రిలీజైన రీలోడెడ్ వెర్షన్ మూవీ వసూళ్లను మరింత పెంచాయి. అయితే ఇప్పుడీ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. గత కొన్ని వారాల నుంచి పుష్ప2 ఓటీటీ విడుదల గురించి పలు రూమర్లు వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ పుష్ప2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. దీని కోసం సుమారు రూ.200 కోట్లు చెల్లించినట్టు సమాచారం.
ఈ మూవీని డిసెంబర్ 5 విడుదల చేసినప్పుడు నిడివి 3 గంటల 20 నిమిషాలు. సంక్రాంతి తర్వాత మరో 20 నిమిషాలు కలపడంతో నిడివి 3.40 గంటలకు చేరుకుంది. ఇప్పుడు మరో 4 నిమిషాలు కలిపి ఓటీటీలో రిలీజ్ చేశారు. దీంతో పుష్ఫ2 మొత్తం రన్ టైమ్ 3.44 గంటలు ఉంది. జనవరి 30 నుంచి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ పుష్ప2 స్ట్రీమింగ్ అవుతోంది.
పుష్ప2 రీలోడెడ్ వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. అంతేకాదు నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అప్పుడే టాప్‌లో ట్రెండ్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఓటీటీలోనూ పుష్ఫరాజ్ తన ఫైర్ చూపించేలా ఉన్నాడంటూ సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. ఇక పుష్ప2 సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా జోడీకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఫహద్ ఫాజిల్, రావు రమేష్, జగపతి బాబు, సునీల్, అనసూయ తదితరులు తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు.