Kangana Ranaut:అంతలా నచ్చేసిందా..? మోనాలిసా అందంపై కంగనా కామెంట్స్ వైరల్
మోనాలిసా అందంపై ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా సెన్సేషనల్ పోస్ట్ పెట్టారు. కుంభమేళాలో మోనాలిసాతో ఫొటోలు దిగేందుకు చాలామంది పోటీ పడ్డారు.

అంతలా నచ్చేసిందా..? మోనాలిసా అందంపై కంగనా కామెంట్స్ వైరల్
Kangana Ranaut: ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మోనాలిసా అనే రుద్రాక్షలు అమ్ముకునే అమ్మాయి సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే. అతి సాధారణ యువతి తన సహాజ సౌందర్యంతో అందర్నీ కట్టిపడేసి స్టార్ హీరోయిన్ అంత పాపులారిటీ దక్కించుకుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా మోనాలిసాకు సంబంధించిన వీడియోలే కనిపిస్తున్నాయి. అయితే వైరల్ గర్ల్ మోనాలిసాపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మోనాలిసా అందంపై ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా సెన్సేషనల్ పోస్ట్ పెట్టారు. కుంభమేళాలో మోనాలిసాతో ఫొటోలు దిగేందుకు చాలామంది పోటీ పడ్డారు. వారి తీరు చూస్తుంటే చాలా బాధేసింది. వారిని ద్వేషించడం తప్ప నేను ఏం చేయగలను. ఇండస్ట్రీలో తనలాంటి రంగులో ఉన్న హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. వారిని మీరు ఇలానే అభిమానిస్తున్నారా..? కాజోల్, దీపికా పదుకొణె లాంటి హీరోయిన్లపై చూపిన ప్రేమాభిమానాలే కొత్తవారిపైనా చూపిస్తున్నారా..? మోనాలిసాను గుర్తించినట్టే తనలా ఉన్న కొత్తవారిని ఎందుకు గుర్తించరు..? అంటూ కంగనా సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కంగనా పోస్ట్ సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా మారింది. అది చూసిన వారు రకరకాలుగా స్పందిస్తున్నారు.
మహాకుంభమేళాలో తన సహజ సౌందర్యంతో అందరినీ ఆకర్షించింది ఇండోర్‌కు చెందిన మోనాలిసా. దీంతో కుంభమేళాకు వెళ్లిన వారు ఆమెను వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలు వైరల్ కావడంతో సోషల్ మీడియా స్టార్ అయిపోయారు. తర్వాత కుంభమేళాకు వెళ్లిన వారంతా సెల్ఫీల కోసం ఆమె వెంట పడడంతో మోనాలిసా అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. అయితే సోషల్ మీడియా స్టార్‌డమే ఆమెకు సినిమాల్లో అవకాశాలు దక్కేలా చేశాయి. మోనాలిసా డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో నటించబోతున్నారు.
ఇక కంగనా సినిమాల విషయానికొస్తే.. ఆమె స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమర్జెన్సీ సినిమా ఇటీవల ప్రేక్షకులను పలకరించింది. ఎన్నో కాంట్రవర్సీల నడుమ ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. దీని తర్వాత ఆమె మరో కొత్త ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. మాధవన్‌తో కలిసి ఓ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో నటించనున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇదే కాకుండా వీరిద్దరి కాంబినేషన్‌లో తను వెడ్స్ మను 3 కూడా రూపొందుతుంది.