Maha Kumbh 2025: మోనాలిసాకు ఆ సినిమాలో ఛాన్స్.. వెతుక్కుంటూ ఇంటికెళ్లిన బాలీవుడ్ డైరెక్టర్..!
మహాకుంభమేళాకు పొట్టకూటి కోసం వెళ్లిన యువతి దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. ఆమె అందం, అమాయకమైన చూపులే ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి.

మోనాలిసాకు ఆ సినిమాలో ఛాన్స్.. వెతుక్కుంటూ ఇంటికెళ్లిన బాలీవుడ్ డైరెక్టర్..!
Monalisa: మోనాలిసా.. గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో పూసలు అమ్ముకునే అమ్మాయి.. తన అందం, చూపులతో అందర్నీ కట్టిపడేసి ఓవర్ నైట్‌లో సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. అయితే సోషల్ మీడియా స్టార్‌గానే కాదు.. సిల్వర్ స్క్రీన్ పై కూడా కనిపించబోతోంది. అవును మీరు వింటున్నది నిజమే. మోనాలిసా కోసం బాలీవుడ్ డైరెక్టర్ ఆమెను వెతుక్కుంటూ ఇంటికెళ్లి మరీ ఆఫర్ ఇచ్చారు. ఇంతకీ ఆమెకు ఆఫర్ ఇచ్చిన ఆ డైరెక్టర్ ఎవరు, ఏ సినిమాలో నటించబోతుంది అనే విషయాలను తెలుసుకుందాం.
ఎవరిని ఎప్పుడు ఏ అదృష్టం వరిస్తుందో చెప్పలే. దీనికి ఉదాహరణనే మోనాలిసా. మహాకుంభమేళాకు పొట్టకూటి కోసం వెళ్లిన యువతి దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. ఆమె అందం, అమాయకమైన చూపులే ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. ఇప్పుడు సినిమా ఛాన్స్ కూడా వెతుక్కుంటూ వచ్చింది. అదృష్టం తలుపుతడితే ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి. ఈమె కూడా ఓకే చెప్పేసింది.
పూసలు అమ్ముకునే అమ్మాయి.. సినిమాల్లో ఛాన్స్ కొట్టేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. కానీ సోషల్ మీడియా ఆమె జీవితాన్నే మార్చేసింది. కుంభమేళాలో మోనాలిసాకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ఆ తేనేకళ్ల అమ్మాయి సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది. అయితే బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రాకు మోనాలిసా బాగా నచ్చేసింది. దీంతో ఆమెకు తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పారు. అన్నట్టుగానే ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.
సనోజ్ మిశ్రా.. ఖర్గోన్ జిల్లా మహేశ్వర్‌లోని మోనాలిసా ఇంటికి వెళ్లి ఆమె కుటుంబాన్ని కలిశారు. ఆమె తండ్రికి చిత్ర పరిశ్రమపై ఉన్న సందేహాలను క్లియర్ చేశారు. దీంతో మోనాలిసా తండ్రి జై సింగ్ తన కుమార్తె సినిమాల్లో నటించేందుకు అంగీకరించారు. ఈ విషయాన్ని స్వయంగా సనోజ్ మిశ్రా సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ పోస్ట్ చేశారు. సనోజ్ నెక్ట్స్ సినిమా డైరీ ఆఫ్ మణిపూర్‌లో మోనాలిసా నటించనుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి నెల రోజుల టైం ఉందని.. అప్పటి వరకు మోనాలిసాకు యాక్టింగ్ క్లాస్‌ల ద్వారా శిక్షణ ఇస్తామని సనోజ్ తెలిపారు. డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో మోనాలిసాకు మంచి పాత్ర ఇస్తానని అది ఆమెకు పేరు తెచ్చిపెడుతుందన్నారు.
డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాను దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందించనున్నట్టు సమాచారం. ఈ మూవీ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ నుంచి మోనాలిసా షూటింగ్‌లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. మోనాలిసాకు సినిమా ఛాన్స్ రావడంతో బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్‌తో పోలుస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తన కళ్లే తనకు ఈ ఛాన్స్ వచ్చేలా చేశాయని.. ఐశ్వర్య రాయ్ లాగా తను కూడా మంచి పేరు తెచ్చుకోవాలంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇదిలా ఉండే డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఇప్పటికీ 12 సినిమాలు తెరకెక్కించారు. ఇందులో గాంధీ గిరీ, ది డైరీ ఆఫ్ బెంగాల్, కాశీ టూ కాశ్మీర్, రామ్ కీ జన్మభూమి వంటి సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో హీరోగా బాలీవుడ్ స్టారో హీరో రాజ్ కుమార్ రావు సోదరుడు అమిత్ రావు తెరంగేట్రం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.