Thandel Movie: బొమ్మ అదిరింది.. సెన్సార్ సభ్యులనే ఫ్లాట్ చేసిన తండేల్ మూవీ..!

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. కార్తికేయ 2 ఫేం చందూ మొండేటి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించారు.

Update: 2025-01-30 13:40 GMT
Thandel Movie: బొమ్మ అదిరింది.. సెన్సార్ సభ్యులనే ఫ్లాట్ చేసిన తండేల్ మూవీ..!

బొమ్మ అదిరింది.. సెన్సార్ సభ్యులనే ఫ్లాట్ చేసిన తండేల్ మూవీ..! 

  • whatsapp icon

Thandel Movie: నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. కార్తికేయ 2 ఫేం చందూ మొండేటి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించారు. ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఫుల్ పాజిటివ్ బజ్ వచ్చింది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తయింది. ఈ మూవీ సెన్సార్ సభ్యులను సైతం ఫ్లాట్ చేసినట్టు తెలుస్తోంది. ఇంతకీ సెన్సార్ సభ్యులు ఇచ్చిన రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం.

సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమాపై అల్లు అరవింద్ ఫుల్ కాన్ఫిడెంట్‌తో ఉన్నారని గీతా ఆర్ట్ సంస్థ తెలిపింది. ఇక నిర్మాత బన్నీ వాసు.. నాగచైతన్య కెరీర్‌లో భారీ కలెక్షన్స్ తెచ్చే చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ అదిరిపోయిందంటున్నారు అభిమానులు. లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి కాంబోలో వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తండేల్ సినిమా ఎక్కువగా సాగదీయకుండా.. చాలా క్రిస్పీగా కట్ చేసినట్టు తెలుస్తోంది. కథలో ఉండే ఎమోషన్స్‌ను నీరుగారకుండా సన్నివేశాల మధ్య ఉండే భావోద్వేగాన్ని ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేలా ఎడిట్ చేశారంటూ టాక్ వినిపిస్తోంది. యాడ్స్‌తో కలిపి సుమారుగా 2.32 గంటలు నిడివి మాత్రమే ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకుంది చిత్రబృందం. ఈ విషయం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న తర్వాత క్లారిటీ ఇచ్చారు.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. కాకినాడ ప్రాంతానికి చెందిన తండేల్ రాజు అనే జాలరి పాకిస్థాన్‌లో ఎలా చిక్కుకుపోయారు. అతడిని సాయి పల్లవి ఎలా రక్షించుకుంది అనేది ఈ సినిమా స్టోరీ. అయితే సినిమా మొత్తంలో పాకిస్థాన్ ఎపిసోడ్ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుందట. మిగతాదంతా రాజు, బుజ్జితల్లి పాత్రల చుట్టే తిరుగుతోంది తెలుస్తోంది. నాగచైతన్య, సాయి పల్లవి మధ్య అదిరిపోయే కెమిస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించి డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను భారీగా ప్లాన్ చేసినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా విడుదలకు ముందే సూపర్ హిట్ అంటూ టాక్ రావడంతో ఫిబ్రవరి 7 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News