మా పిల్లల ఫొటోలు తీయొద్దు.. కరీనా కపూర్ విజ్ఞప్తి
సాధారణంగా సెలబ్రిటీలు, వారి పిల్లలు ఎక్కడ కనిపించినా ఇటు మీడియా, అటు ఫ్యాన్స్ ఫొటోలు తీస్తారు. ఇక కరీనా కపూర్, సైఫ్ ఇద్దరూ స్టార్ సెలబ్రిటీలు కావడంతో వారు ఎక్కడ కనిపించినా మీడియా ఫొటోలు తీస్తూ వెంటపడుతుంది.

మా పిల్లల ఫొటోలు తీయొద్దు.. కరీనా కపూర్ విజ్ఞప్తి
Kareena Kapoor : సాధారణంగా సెలబ్రిటీలు, వారి పిల్లలు ఎక్కడ కనిపించినా ఇటు మీడియా, అటు ఫ్యాన్స్ ఫొటోలు తీస్తారు. ఇక కరీనా కపూర్, సైఫ్ ఇద్దరూ స్టార్ సెలబ్రిటీలు కావడంతో వారు ఎక్కడ కనిపించినా మీడియా ఫొటోలు తీస్తూ వెంటపడుతుంది. ముఖ్యంగా వారి పిల్లలు తైమూర్ అలీఖాన్, జహంగీర్ అలీఖాన్ ఫొటోలు, వీడియోలు తీసేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే తాజాగా తమ పిల్లల ఫొటోలు తీయవద్దని కరీనా కపూర్ మీడియాకు విజ్ఞప్తి చేశారు. సైఫ్ పై దాడి తర్వాత కరీనా ఈ ప్రకటన చేశారు.
ఇక నుంచి తైమూర్, జేహ్ ఎక్కడ కనిపించినా వారి ఫొటోలు తీయొద్దని కోరారు. స్కూల్‌కు వెళ్తుండగా, పుట్టిన రోజు వేడుకల్లో, క్రీడా కేంద్రాల్లో కనిపించినా వారి ఫొటోలు తీయొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే కరీనా, సైఫ్‌ల ఫొటోల కోసం కూడా వారి ఇంటి ముందు ఉండొద్దని.. ఏదైనా ఈవెంట్‌లలో కనిపిస్తే వారి చిత్రాలు తీసుకోమని పీఆర్ టీం తెలిపింది. అయితే ఇటీవల సైఫ్ పై జరిగిన దాడి తర్వాత వారి సెక్యూరిటీ దృష్ట్యా ఈ నిబంధన పెట్టినట్టు తెలుస్తోంది.
ఈ నెల 16న సైఫ్ పై దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి దొంగతనం కోసం బాంద్రాలోని తన నివాసంలోకి చొరబడ్డాడు. దుండగుడు సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలోకి వెళ్లడాన్ని గమనించిన కేర్ టేకర్ గట్టిగా అరవడంతో సైఫ్ వచ్చాడు. దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. అతడు సైఫ్ పై కత్తితో దాడి చేశారు. ఈ క్రమంలో సైఫ్‌నకు ఆరు చోట్ల గాయాలయ్యాయి. దీంతో అతన్ని ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. సర్జరీ చేసిన వైద్యులు సైఫ్ వెన్నుముక భాగంలో కత్తి మొనను తొలగించారు.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్ ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. దాడి కారణంగా తన కుటుంబం ఆందోళనకు గురైందని.. సైఫ్ సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నట్టు కరీనా ఇటీవల చెప్పారు. అయితే ఇలాంటి సమయంలో తమకు సెక్యూరిటీ అవసరం అని భావించిన కరీనా.. తమ పిల్లల ఫొటోలను తీయొద్దని విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది.