సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్ కొత్త డైరెక్టర్‌గా సారా

సారా టెండూల్కర్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కూతురిగా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ గా అందరికీ సుపరిచితమే.

Update: 2025-01-29 12:25 GMT
సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్ కొత్త డైరెక్టర్‌గా సారా

సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్ కొత్త డైరెక్టర్‌గా సారా

  • whatsapp icon

Sara Tendulkar: సారా టెండూల్కర్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కూతురిగా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ గా అందరికీ సుపరిచితమే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ భారీ అభిమానులు సంపాదించుకున్న సారా.. తన లైఫ్ స్టైల్, ఇతర విషయాలను తరచూ అభిమానులతో పంచుకుంటారు. అయితే సారా తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్‌కి డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. దీని ద్వారా నిరుపేదలకు సేవ చేయాలని భావిస్తున్నారు. సారా నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.

ముంబైలోని ధీరుభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో సారా విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లారు.. అక్కడి లండన్ యూనివర్సిటీ కాలేజీలో వైద్య విద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సారా తల్లి అంజలి కూడా వైద్యురాలే కావడంతో తల్లి బాటలోనే వైద్య వృత్తిని ఎంచుకున్నారు. ఇప్పుడు తన తండ్రి స్థాపించిన సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్‌కు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

నిరుపేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో స్థాపించిన సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్ ఇటీవల ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ముంబైలోని బాంబే క్లబ్‌లో ఫౌండేషన్ 5వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో సారాను ఫౌండేషన్ డైరెక్టర్‌గా ప్రకటించారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల సారా సంతోషం హర్షం వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులు ప్రారంభించిన ఈ ఫౌండేషన్‌ను మరింత అభివృద్ధి చేస్తానని.. ఫౌండేషన్ ద్వారా ప్రతి చిన్నారి కలను సాకారం చేస్తానన్నారు. నిరుపేద పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతానని.. వారి కళను సహకారం చేయడంలో అంకితభావంతో ముందుకు సాగుతానని తెలిపారు.

ఆరోగ్యం, విద్య, క్రీడల ప్రధాన దృక్పథంతో లక్షలాది మంది చిన్నారుల జీవితాలను మార్చడంపై సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్దృష్టి పెట్టింది. ఈ సంస్థ గత ఐదేళ్లలో లక్ష మంది పిల్లల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకువచ్చింది. అయితే ఈ సందర్భంగా సారా ఈ విషయాన్ని గుర్తు చేశారు. తనకు తన కుటుంబం ఎల్లప్పుడూ విరాళాల విలువను నేర్పిందన్నారు. ఫౌండేషన్ గత ఐదేళ్లల్లో అందించిన సేవలు తన మనస్సును తాకాయని.. ఈ ప్రయాణంలో తనను భాగస్వామ్యం చేస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఫౌండేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం పట్ల పలువురు సారాకు అభినందనలు తెలియజేస్తున్నారు. సచిన్ టెండుల్కర్ జీవితంలో క్రీడారంగంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని.. అదేవిధంగా సారా కూడా ఈ ఫౌండేషన్‌ని ముందుకు నడిపించి, సమాజానికి మరింత సేవ చేయాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News