బాలకృష్ణతో వరుస సినిమాలపై ప్రగ్యా జైస్వాల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

ప్రగ్యా జైస్వాల్ గురించి పరిచయం అక్కర్లేదు. తక్కువ సినిమాలు చేసినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన డాకు మహారాజ్ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది.

Update: 2025-01-29 06:58 GMT
బాలకృష్ణతో వరుస సినిమాలపై ప్రగ్యా జైస్వాల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

 బాలకృష్ణతో వరుస సినిమాలపై ప్రగ్యా జైస్వాల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

  • whatsapp icon

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ గురించి పరిచయం అక్కర్లేదు. తక్కువ సినిమాలు చేసినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన డాకు మహారాజ్ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో కావేరిగా ప్రగ్యా జైస్వాల్ ఆకట్టుకున్నారు. గతంలో ఆమె బాలకృష్ణతో అఖండలో నటించారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్‌ అయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రగ్యా బాలకృష్ణతో వరుస సినిమాల్లో నటించడం పట్ల ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ప్రగ్యా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

బాలకృష్ణ ఓ లెజెండ్. ఆయన పేరు చెప్పగానే తనకు పాజిటివిటి అనే పదం గుర్తొచ్చింది. ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నారు. మనసులో మాటను నిర్మొహమాటంగా చెప్పగల వ్యక్తి. అందరినీ ఒకేలా గౌరవిస్తారు. చాలా మంచి మనిషి అని ఆమె బాలకృష్ణను పొగడ్తలతో ముంచెత్తారు. పాత్ర ఆధారంగా నటీనటులను ఎంపిక చేస్తారు. వయసును చూసి సినిమా అవకాశాలు ఇవ్వరన్నారు. తన పాత్రకు తాను వందశాతం న్యాయం చేశానా లేదా అనేదే ఆలోచిస్తాను. తన దృష్టిలో ఏజ్ అనేది అసలు సమస్యేకాదు. అఖండలో తమ ఇద్దరినీ స్క్రీన్ పై చూసి ఆశ్చర్యపోయానని ఆమె గుర్తు చేసుకున్నారు.

తన బర్త్ డే టైంలో డాకు మహారాజ్ రిలీజై మంచి విజయాన్ని అందుకోవడం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. అంతేకాదు డాకు మహారాజ్‌లో తన పాత్ర గురించి చెప్పుకున్నారు. సినిమాలో తాను నటించిన కావేరి పాత్రకు వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. డాకు మహారాజ్ థియేటర్లలోకి వచ్చినప్పటి నుంచి అందరూ తనను డాకు మహారాణి అని పిలుస్తున్నారంటే ఆ పాత్రకు ఆడియెన్స్ అంతలా కనెక్ట్ అయ్యారని ఆమె అన్నారు.ఒక నటిగా తనకు ఎంతో సంతృప్తినిచ్చిన సినిమా డాకు మహారాజ్ అని, గర్భిణి పాత్రలో నటించడం తనకు ఓ కొత్త అనుభూతి ఇచ్చిందన్నారు. తనకు పుట్టబోయే బిడ్డ కోసం కావేరి చేసే పోరాటం ప్రేక్షకుల మనసులను ఎంతగానో కదిలించిందని అందుకే ప్రేక్షకులు తనను డాకు మహారాణిగా గుర్తించారని ఆమె తెలిపారు.

2021లో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్‌గా అఖండ2 తెరకెక్కుతోంది. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను కుంభమేళాలో నిర్వహించారు. ఈ షూటింగ్‌కు సంబంధించి బోయపాటి చేసిన వ్యాఖ్యలు అఖండ2 సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా నుంచి ప్రగ్యా తప్పుకున్నట్టు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ వార్త మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Tags:    

Similar News