OTT Movie: 9 ఏళ్ల తర్వాత తెలుగులోకి డబ్.. ఓటీటీలో సందడి చేస్తున్న ఆ మూవీ ఏంటంటే..?
OTT Movie: ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులను అలరించేందుకు ఇంట్రెస్టింగ్ మూవీస్ అందుబాటులోకి వస్తున్నాయి.

OTT Movie: 9 ఏళ్ల తర్వాత తెలుగులోకి డబ్.. ఓటీటీలో సందడి చేస్తున్న ఆ మూవీ ఏంటంటే..?
OTT Movie: ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులను అలరించేందుకు ఇంట్రెస్టింగ్ మూవీస్ అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇతర భాషల్లో విడుదలైన చిత్రాలు తెలుగులోకి డబ్ అవుతున్నాయి. గతంలో విడుదలైన చిత్రాలు సైతం ప్రస్తుతం మళ్లీ ఓటీటీ వేదికగా విడులై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది.
2016లో విడుదలైన 'మలై సేరతు మయక్కం' అనే తమిళ మూవీని ప్రస్తుతం తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను 'నన్ను వదిలి నువ్వు పోలేవులే' పేరుతో డబ్ చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఒక వైవిధ్యమైన ప్రేమ కథతో వచ్చిన ఈ సినిమా అప్పట్లో తమిళంలో మంచి విజయాన్ని నమోదు చేసుకోగా తాజాగా తెలుగు ప్రేక్షకుల కోసం తీసుకొచ్చారు. ఇంతకీ ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సినిమాలో హీరో ఒక పల్లెటూరి అబ్బాయి. దీంతో అమ్మాయిలు అతనిని ప్రేమించడానికి ఇష్టపడరు. ఒక్కో అమ్మాయి కూడా ప్రేమించడం లేదన్న బాధతో ఇంట్లో వాళ్లకు చెప్పి అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటాడు. అయితే పెళ్లి కూతురు (హీరోయిన్) తన బాయ్ ఫ్రెండ్ ఉద్దేశం తెలుసుకొని, బ్రేకప్ చెప్పి బాధపడుతుంది. ఆ తర్వాత మరొకరిని ప్రేమిస్తుంది. అది కూడా ఫెయిల్యూర్ కావడంతో హీరోయిన్ డిప్రెషన్ లోకి వెళ్లి పోతుంది. ఈ క్రమంలో హీరోకి, హీరోయిన్ తో పెళ్లి సంబంధం కుదురుతుంది.
అందమైన అమ్మాయి తన జీవితంలోకి వచ్చిందని సంతోషపడ్డ హీరో ఎగిరి గంతేస్తాడు. మొదటి రాత్రి నుంచి హీరోయిన్, హీరోని దూరం పెడితూ వస్తుంది. ఈ కారణంగా చాలా రోజులు వీళ్ళిద్దరూ విడివిడిగానే ఉంటారు. అయితే భార్యను మాత్రం హీరో చాలా ఇష్టపడుతుంటాడు. ఈ క్రమంలోనే పెద్దల కోసం మ్యారేజ్ యానివర్సరీ చేసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో భార్యతో శారీరకంగా కలవాలని ప్రయత్నిస్తాడు. దీంతో కుదరదని చేయి కట్ చేసుకుంటుంది.
దీంతో చివరికి ఏం చేసేది లేక ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే హీరో మాత్రం అందుకు ఇష్టపడడు. ఎన్ని సార్లు బతిమిలాడినా విడాకులు కావాలని బెదిరిస్తుంది. దీంతో చివరికి హీరో విడాకులు ఇచ్చేస్తాడు. ఈ నేపథ్యంలోనే చాలా రోజుల తర్వాత తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌తో కలిసి టూర్‌కి వెళ్తుంది. ఈ విషయం తెలుసుకున్న మాజీ భర్త సైతం అదే ప్రదేశానికి వెళ్తాడు. అయితే హీరోయిన్ జలసీగా ఫీలవ్వాలనే ఉద్దేశంతో అతను తన వెంట మరో అమ్మాయిని కూడా తెచ్చుకుంటాడు. ఈ క్రమంలోనే ఒకరిని ఒకరు చూసుకుంటూ, ఎంతగా మిస్ అయ్యామో అని బాధపడుతూ ఉంటారు. అలా ఒకచోట ఇద్దరు కూర్చుని, ఈ సమస్యకు పరిష్కారం నన్ను నువ్వు చంపడమే అంటూ హీరోయిన్ చేతిలో కత్తి పెట్టి పొడిపించుకుంటాడు హీరో. ఈ అనుకోని సంఘటనతో హీరోయిన్ షాక్ అవుతుంది. చివరికి హీరో ఈ ప్రమాదం నుంచి బయటపడతాడా? హీరో, హీరోయిన్ తమ ప్రేమను మళ్లీ పంచుకుంటారా? అసలు ఏమైంది లాంటి వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.