Venkatesh: అలాంటి వాళ్లందరి నోళ్లు మూయించిన వెంకటేష్.. 60 ఏళ్ల వయసులో కూడా తగ్గేదేలే అన్నట్లు

వెంకటేష్.. సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టినా.. తన టాలెంట్‌తో ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.

Update: 2025-01-30 08:52 GMT
Venkatesh: అలాంటి వాళ్లందరి నోళ్లు మూయించిన వెంకటేష్.. 60 ఏళ్ల వయసులో కూడా తగ్గేదేలే అన్నట్లు

Venkatesh: అలాంటి వాళ్లందరి నోళ్లు మూయించిన వెంకటేష్.. 60 ఏళ్ల వయసులో కూడా తగ్గేదేలే అన్నట్లు

  • whatsapp icon

Venkatesh : వెంకటేష్.. సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టినా.. తన టాలెంట్‌తో ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. వరుస విజయాలతో విక్టరినే ఇంటి పేరుగా మార్చుకున్నారు. హీరోగానే కాదు మంచి హాస్యాన్ని పండించగలరు. వెంకటేష్ సినిమాల్లో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే వెంకటేష్ సినిమాను కుటుంబంతో కలిసి చూసేందుకు ఎక్కువగా ఇష్టపడతారు.

గతంలో వచ్చిన వెంకటేష్ సినిమాల్లో ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలే ఉన్నాయి. ఇప్పుడు సంక్రాంతి కానుకగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రికార్డు క్రియేట్ చేశారు వెంకటేష్. అయితే వెంకటేష్ గత కొన్నేళ్లుగా మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. దీంతో సోలో హీరోగా వెంకటేష్ పని అయిపోయింది అనుకున్న తరుణంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా అతనికి మంచి సక్సెస్ ఇచ్చింది. ఈ సినిమాతో పుకార్లకు చెక్ పెట్టారు వెంకటేష్. 60 ప్లస్ ఏజ్‌లోనూ ఏ మాత్రం తగ్గేదే లేదు అంటూ థియేటర్ల దగ్గర కలెక్షన్లు రాబడుతున్నారు.

ఈ సినిమా తక్కువ బడ్జెట్‌లో, తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసుకుని.. సంక్రాంతి సీజన్ చివర్లో విడుదలైంది. ఈ సినిమా లాస్ట్‌లో వచ్చిన ఒక్కో రికార్డును బ్రేక్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఇప్పటి వరకు సంక్రాంతి సినిమాల్లో అల వైకుంఠపురం సినిమాతో పాటు ప్యాన్ ఇండియా సంక్రాంతి చిత్రాల్లో హనుమాన్ మూవీలను దాటేసి టాప్ ప్లేస్ దక్కించుకుంది. మొత్తంగా నాన్ పాన్ ఇండియా కేటగిరిలో సంక్రాంతి సీజన్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన మూవీగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

మొత్తానికి కుటుంబ ప్రేక్షకుల్లో వెంకటేష్ ఇమేజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదని సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరోసారి నిరూపితమైంది. అంతేకాదు తెలుగులో సీనియర్ హీరో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, సైరా నరసింహారెడ్డి సినిమాల లైఫ్ టైమ్ వసూళ్లను దాటేసి సీనియర్ టాప్ స్టార్ హీరోల్లో తెలుగులో నెంబర్ వన్‌గా నిలిచారు. ఇక 60 ఏళ్ల పై బడిన వయస్సులో దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన హీరోగా రికార్డు క్రియేట్ చేశారు. రజనీకాంత్ 2.0తో రూ.700 కోట్లు, జైలర్ సినిమాలతో రూ.600 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించారు. కమల్ హాసన్.. విక్రమ్ సినిమాతో రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించారు. ఇక చిరంజీవి సైరాతో రూ.240 కోట్లు సాధించారు. మొత్తంగా తెలుగులో చిరంజీవిని బీట్ చేసి రజనీకాంత్, కమల్ హాసన్ సరసన చేరారు వెంకటేష్. దీంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్ మరెన్నో ఇలాంటి కథలతో అలరించాలని కోరుకుంటున్నారు.

Tags:    

Similar News