రోడ్డున పడ్డ మోహన్ బాబు కుటుంబ గొడవలు.. మనోజ్ ఇంటిపై మంచు విష్ణు దాడి..
రోడ్డున పడ్డ మోహన్ బాబు కుటుంబ గొడవలు.. మనోజ్ ఇంటిపై మంచు విష్ణు దాడి..
Vishnu Manchu- Manchu Manoj: మంచు సోదరులు విష్ణు మంచు, మంచు మనోజ్ మధ్య వివాదం రోడ్డున పడింది. మంచు మనోజ్ ఇంటిపైకి మంచు విష్ణు వచ్చి దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు మంచు మనోజ్ ఓ వీడియోను షేర్ చేశాడు. ఇలా ఇంటి మీదకు వచ్చి దాడి చేస్తాడంటూ విష్ణు విజువల్స్‌ను మనోజ్ షేర్ చేశాడు. అయితే ఈ విజువల్స్‌లో మంచు విష్ణు కనిపించాడు. ఒరేయ్ అరేయ్ అని ఏదో అంటున్నాడు కదా? అని విష్ణు అరుస్తున్నాడు. విష్ణుని అందరూ ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిగో అండి ఇలా ఇంటి మీదకు వచ్చి అందరినీ కొడుతుంటాడు అంటూ తన అన్న గురించి వీడియోను షేర్ చేశాడు మంచు మనోజ్.