Megastar Chiranjeevi: వస్తుందన్న భయం.. రాదన్న నిర్లక్ష్యం వద్దు : చిరంజీవి
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న భయంకరమైన వ్యాధి కరోనా వైరస్.. చైనాలో మొదలైన ఈ మహమ్మారి 140 పైగా దేశాలకి వ్యాపించి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న భయంకరమైన వ్యాధి కరోనా వైరస్.. చైనాలో మొదలైన ఈ మహమ్మారి 140 పైగా దేశాలకి వ్యాపించి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి కారణంగా చాలా మంది తమ ప్రాణాలను కోల్పోగా, మరికొంత చికిత్స పొందుతున్నారు. అయితే దీనిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే దీని నివారణకి వ్యక్తిగత శుభ్రత ముఖ్యమని చెబుతున్నాయి. మొఖానికి మాస్కులు, చేతులను శుభ్రంగా కడుక్కోవాలని దీనివలన కొంతలో కొంత అరికట్టవచ్చునని చెబుతున్నాయి. దీనిని ప్రజలలోకి మరింత తీసుకెళ్లేందుకు సినీ స్టార్స్ కూడా తమ వంతు సహాయం చేస్తున్నారు.
అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి దీనిపైన వీడియో చేశారు. " అందరికి నమస్కారం.. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకి గురి చేస్తున్న సమస్య కరోనా.. అయితే మనకి ఎదో అయిపోతుందన్న భయం కానీ, మనం ఏమీ కాదు అన్న నిర్లక్ష్యం కానీ ఈ రెండు పనికిరావు. జగ్రత్తగా ఉండి, దైర్యంగా ఎదురుకోవాల్సిన సమయం ఇది.. జనసముహానికి దూరంగా ఉండండి. ఈ ఉద్రుత్తం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవ్వడం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
మోచేతి వరకు చేతులను సబ్బుతో శుభ్రంగా సుమారు 22 సెకెండ్ల పాటుగా కడుక్కోండి! తుమ్మున, దగ్గిన కర్చీప్ లాంటివి అడ్డం పెట్టుకోవడం లేదా టిష్యు పేపర్ లను అడ్డు పెట్టుకోవడం తప్పనిసరి.. ఆ వాడిన టిష్యు పేపర్ కూడా చేత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి,కంటికి మొఖానికి,తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం,జలుబు,దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి!
ఈ జాగ్రత్తలు తీసుకుంటే కరోనా ప్రమాది కారి కాకపోయినప్పటికీ, నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అవకాశం ఉంది. అలా కాకుండా చూసుకునే భాద్యత మన పైన ఉంది. ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయ ప్రకారం నమస్కారం చేద్దాం.. అదే ఉత్తమం " అని చిరంజీవి పేర్కొన్నారు.
ఇక కరోనా వ్యాప్తి విస్తరిస్తున్న నేపధ్యంలో చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాని వాయిదా వేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి నిర్మిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
A word of caution from Mega Star Chiranjeevi garu. Stay safe. #Covid19 #Covid19India pic.twitter.com/4Drg0NPvZ0
— Konidela Pro Company (@KonidelaPro) March 19, 2020