జయం రవి విడాకుల పిటిషన్ పై ఫ్యామిలీ కోర్టు ఆసక్తికర సూచన

జయం రవి కోర్టుకు హాజరు కాగా.. ఆయన భార్య ఆర్తి వీడియో కాల్ ద్వారా హాజరయ్యారు. 2009లో హీరో రవి, ఆర్తి వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు

Update: 2024-11-15 14:26 GMT

జయం రవి విడాకుల పిటిషన్ పై ఫ్యామిలీ కోర్టు ఆసక్తికర సూచన

కోలీవుడ్ హీరో జయం రవి విడాకుల తంతు ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో తాము విడాకులు తీసుకుంటున్నట్టు రవి ప్రకటించారు. తన భార్య నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. శుక్రవారం పిటిషన్ పరిశీలించిన చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. మధ్యవర్తిత్వం ద్వారా రాజీకి ప్రయత్నించాలని.. ఇందుకోసం మధ్యవర్తిత్వ సమావేశాలు నిర్వహించాలంటూ సూచన చేసింది.

జయం రవి కోర్టుకు హాజరు కాగా.. ఆయన భార్య ఆర్తి వీడియో కాల్ ద్వారా హాజరయ్యారు. ఇరు వర్గాల వాదనలను విన్న కోర్టు మరోసారి రాజీకి ప్రయత్నించాలని సూచించింది. లేదు తాము విడిపోవడానికే సిద్ధమైతే అందుకు సరైన కారణాన్ని చెప్పాలని తెలిపింది. 2009లో హీరో రవి, ఆర్తి వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పరస్పర అంగీకారంతోనే తాము విడిపోవాలని అనుకున్నట్టు సెప్టెంబర్‌లో జయం రవి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఎన్నో ఆలోచనలు, చర్చల తర్వాత తాను, తన భార్య ఆర్తి డివోర్స్ తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు. మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నట్టు తెలిపారు.

అయితే జయం రవి ప్రకటనపై ఆర్తి సంచలన ఆరోపణలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. తనకు తెలియకుండానే, అనుమతి తీసుకోకుండానే డివోర్స్ గురించి రవి బహిరంగంగా ప్రకటించారని చెప్పారు. కాగా తన భార్య ఆరోపణలపై ఆయన గతంలో మీడియాతో మాట్లాడారు. ఆమెకు లాయర్ ద్వారా విడాకుల నోటీస్ పంపానని, తన తండ్రికి కూడా ఈ విషయం తెలుసునన్నారు. ఇరు కుటుంబాల పెద్దలు ఈ వ్యవహారం చర్చించుకున్నాకే తాను ప్రకటన చేశానని.. అలాంటప్పుడు వారికి తెలియకుండా విడాకులు ప్రకటించానని ఎలా అంటారని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ఓ సింగర్‌తో రవి రిలేషన్‌లో ఉన్నారంటూ ఆరోపణలు వినిపించాయి. దీనిపై స్పందించిన రవి అవన్నీ అవాస్తవమని చెప్పారు.

Tags:    

Similar News