Diljit Dosanjh: ప్రముఖ సింగర్ దిల్జిత్ దోశాంజ్‌కు తెలంగాణ అధికారుల నోటీసులు.. ఎందుకంటే..?

Diljit Dosanjh: పంజాబ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ సింగర్ దిల్జిత్ దోశాంజ్‌కు తెలంగాణ అధికారులు నోటీసులు ఇచ్చారు.

Update: 2024-11-15 06:07 GMT

Diljit Dosanjh: పంజాబ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ సింగర్ దిల్జిత్ దోశాంజ్‌కు తెలంగాణ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ శంషాబాద్‌‌లో దిల్జీత్ సింగ్ కన్సర్ట్ జరుగనుంది. ఈ కన్సర్ట్‌లో మత్తు పదార్థాలను ప్రోత్సహించేలా పాటలు ప్రదర్శించకూడదని నోటీసులు ఇచ్చారు. తెలంగాణ అధికారులకు చండీగఢ్‌కు చెందిన ప్రొఫెసర్ ఫిర్యాదు చేశారు.

అక్టోబర్‌లో ఢిల్లీ జేఎన్‌యూలో దిల్జీత్ కన్సర్ట్ నిర్వహించారు. ఆ షోలో డ్రగ్స్, మద్యం, వయలెన్స్ ప్రేరేపించేలా దిల్జీత్ సింగ్ పాటలు పాడారని, తెలంగాణలో కూడా అలాంటి పాటలు పాడవద్దని ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు నోటీసు జారీ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలను పాటించాలని ఈవెంట్ నిర్వాహకులను ఆదేశించారు.

లైవ్ షో సమయంలో పెద్దగా మ్యూజిక్ ఏర్పాటు చేయవద్దని ఆదేశించారు. 140 డీబీ కంటే సౌండ్ ఉండకూడదు. ఈ నిబంధనను పాటించాలని సూచించారు. గతంలో దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పాడిన పాటలు హింస, డ్రగ్స్, మద్యాన్ని ప్రేరేపించేలా ఉన్నాయనే ఆరోపణలున్నాయి.

దీంతో హైద్రాబాద్ లో జరిగే ఈవెంట్ లో ఈ తరహా పాటలు ఉండద్దని ప్రభుత్వం తెలిపింది.శంషాబాద్ లో దిల్జిత్ షో పై చండీగఢ్ కు చెందిన ప్రొఫెసర్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నోటీసులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు.


Tags:    

Similar News