Chinmayi: సమంతతో ఇక నా ప్రయాణం ముగిసినట్టే...

Chinmayi-Samantha: స్టార్ బ్యూటీ సమంత మరియు చిన్మయి శ్రీపాద ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

Update: 2022-09-04 08:26 GMT

Chinmayi: సమంతతో ఇక నా ప్రయాణం ముగిసినట్టే...

Chinmayi-Samantha: స్టార్ బ్యూటీ సమంత మరియు చిన్మయి శ్రీపాద ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 'ఏమాయ చేశావే' సినిమా లో సమంత పాత్ర కి చిన్మయి డబ్బింగ్ చెప్పింది. అందులో ఆమె పాత్ర తో పాటు వాయిస్ కి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అప్పటినుండి సమంత అన్నీ సినిమాలకు చిన్మయి డబ్బింగ్ చెప్పింది. అప్పట్నుంచే వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఇక త్వరలోనే వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. పూజ హెగ్డే సమంత వివాదంలో కూడా చిన్మయి సామ్ కి సపోర్ట్ చేస్తూ ఇండైరెక్ట్ గా పూజ ని ఏకి పారేసింది.

కానీ ఇప్పుడు వీరి స్నేహం విచ్ఛిన్నమైందని, ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా చిన్మయి దీని గురించి మాట్లాడుతూ తాము తరచూ కలుస్తూనే ఉంటామని కానీ కలిసే విషయం అందరికీ చెప్పడం వల్ల ఎవరికీ ఎలాంటి లాభం లేదని, అందుకే ఆ విషయాలు ఎవరితో పంచుకోమని చెప్పింది. ఇక డబ్బింగ్ ఆర్టిస్ట్‌ గా సమంతతో తన ప్రయాణం దాదాపు ముగిసిందని ఎందుకంటే ఇప్పుడు సమంతే తన పాత్రలకు డబ్బింగ్ చెప్పుకుంటోంది కాబట్టి ఇప్పుడు ఆమెకు తన గాత్రం అవసరం లేదని చెప్పుకొచ్చింది చిన్మయి.

Tags:    

Similar News