OTT: ఓటీటీలో దుమ్మురేపుతోన్న లక్కీ భాస్కర్‌.. 15 దేశాల్లో ఏకంగా..

Lucky Baskhar OTT: దుల్కర్ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరోగా వెంకీ అట్టూరి దర్శకత్వంలో వచ్చిన 'లక్కీ భాస్కర్‌' (Lucky Baskhar) మంచి విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.

Update: 2024-12-03 13:30 GMT

OTT: ఓటీటీలో దుమ్మురేపుతోన్న లక్కీ భాస్కర్‌.. 15 దేశల్లో ఏకంగా..

Lucky Baskhar OTT: దుల్కర్ సల్మాన్‌ (Lucky Baskhar) హీరోగా వెంకీ అట్టూరి దర్శకత్వంలో వచ్చిన 'లక్కీ భాస్కర్‌' (Lucky Baskhar) మంచి విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఆర్థిక నేరాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించింది. కాగా ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అయిన నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా 5 భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోనూ సందడి చేస్తోంది. రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో లక్కీ భాస్కర్‌ టాప్‌లో కొనసాగుతోంది. 15 దేశాల్లో టాప్‌ 10 సినిమాల్లో లక్కీభాస్కర్‌ మొదటి స్థానంలో నిలవడం విశేషం.

ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయై నటుడు దుల్కర్‌ సల్మన్‌ మాట్లాడుతూ.. 'లక్కీ భాస్కర్ విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే ప్రేమను నెట్‌ఫ్లిక్స్‌లోనూ చూపుతున్నారు. ఈ సినిమా 5 భాషల్లో విడుదలైంది. వాటిలో మలయాళం, తమిళం, తెలుగు భాషలకు నేనే డబ్బింగ్ చెప్పాను. కన్నడ, హిందీ భాషల్లో డబ్బింగ్‌ చెప్పడానికి సమయం లేదు. ఈసారి చేసే సినిమాలకు 5 భాషల్లోనూ నేనే డబ్బింగ్‌ చెప్పడానికి ప్రయత్నిస్తా. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన నాటినుంచి ఎన్నో మెసేజ్‌లు వస్తున్నాయి. అందరికీ ధన్యవాదాలు’ అని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే లక్కీ భాస్కర్‌ స్ట్రీమింగ్‌కు వచ్చే నాటికి దేవర టాప్‌ వన్‌లో ఉంది. అయితే ఇప్పుడు దేవర టాప్‌3లోకి వెళ్లింది. లక్కీభాస్కర్ మూవీలో దుల్కర్‌ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఒక మిడల్‌ క్లాస్‌ కుటుంబానికి చెందిన వ్యక్తి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సాధారణ బ్యాంక్‌ ఉద్యోగి రూ. 100 కోట్లు ఎలా సంపాదించాడు. బ్యాంకింగ్‌ రంగంలో జరిగిన మోసాలను దర్శకుడు బాగా చూపించాడు.

Tags:    

Similar News