Pushpa 2 First Review: పుష్ప 2 రివ్యూ..ట్విస్ట్ మైండ్ బ్లాకింగ్, పర్ఫామెన్స్ పీక్స్
Pushpa 2 Movie First Review in Telugu: దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా 'పుష్ప' (Pushpa) మేనియానే కనిపిస్తోంది. 2021లో తగ్గేదేలే అంటూ పుష్ప (Pushpa)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. ఇప్పుడు ‘పుష్ప 2’ (Pushpa 2)తో అస్సలు తగ్గేదేలే అంటూ వచ్చేస్తున్నాడు.
Pushpa 2 Movie First Review in Telugu: దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా 'పుష్ప' (Pushpa) మేనియానే కనిపిస్తోంది. 2021లో తగ్గేదేలే అంటూ పుష్ప (Pushpa)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. ఇప్పుడు ‘పుష్ప 2’ (Pushpa 2)తో అస్సలు తగ్గేదేలే అంటూ వచ్చేస్తున్నాడు.
పుష్పరాజ్ (pushparaj) మాస్ జాతర కోసం ఫాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్.. పుష్పరాజ్‌పై అంచనాలు పెంచేశాయి. డిసెంబర్ 5న పుష్ప: ది రూల్ (Pushpa 2: The Rule) ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తెలుగు సెన్సార్ ఇప్పటికే పూర్తయింది. తాజాగా హిందీ సెన్సార్ పూర్తి కాగా.. సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.
సెన్సార్ బోర్డు సభ్యులతో కలిసి హిందీ పుష్ప 2 సినిమా (Pushpa 2 Movie) సెన్సార్ షోని ఓవర్సీస్ రివ్యూయర్ అని చెప్పుకొనే ఉమైర్ సంధు (Umair Sandhu) వీక్షించారు. ఈ విషయాన్ని అతడు తన ఎక్స్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'పుష్ప2 సెన్సార్ (pushpa 2 censor) స్క్రీనింగ్ ఇప్పుడే పూర్తయింది. నా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఫస్ట్ రివ్యూ ఇచ్చాను చూడండి' అని అల్లు అర్జున్ ఫాన్స్ తప్పక చూడండి' అని ఉమైర్ సంధు పేర్కొన్నారు. అల్లు అర్జున్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడని, మాస్ అవతారంలో ప్రతీ ఒక్కరినీ ఫిదా చేశాడని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు. ఇంటర్వెల్ ట్విస్ట్ మైండ్ బ్లాకింగ్‌గా ఉందని.. క్లైమాక్స్ అయితే సినిమాకి చాలా చాలా కీలకం అని చెప్పుకొచ్చారు.
'అల్లు అర్జున్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. సౌత్‌లో సూపర్ స్టార్ అయిన అతడికి హిందీలో కూడా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మాస్ అవతారంలో ప్రతీ ఒక్కరినీ ఫిదా చేస్తాడు. బన్నీ లుక్స్ సూపర్, యాక్టింగ్ టాప్ క్లాస్, కామెడీ టైమింగ్ అయితే అద్భుతంగా కుదిరింది. పర్ఫామెన్స్ పీక్స్ , మరో నేషనల్ అవార్డు పక్కా. రష్మిక మంధాన బాగా నటించారు. ఫహద్ ఫాజిల్ తన పర్ఫామెన్స్‌తో చంపేశాడు. క్లైమాక్స్ సినిమాకి చాలా కీలకం.
ఇంటర్వెల్ ట్విస్ట్ మైండ్ బ్లాకింగ్. ఇండియన్ సినిమా చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడూ చూడని డిఫరెంట్ మసాలా సినిమా ఇది. ఇది క్లాసీ మసాలా మూవీ. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ (హిందీ) అంతగా లేదు. పుష్ప 2 పక్కా పైసా వసూల్ ఎంటర్‌టైనర్. సుకుమార్ డైరెక్షన్, అల్లు అర్జున్ యాక్టింగ్ కోసం సినిమా చూడాలి. పార్ట్ 3 సర్‌ప్రైజ్ కోసం సిద్ధంగా ఉండండి’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో ఉమర్ సంధు రాసుకొచ్చారు. అంతేకాదు సినిమాకు 4 రేటింగ్ ఇచ్చారు.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప 2. రష్మిక మంధాన కథానాయికకాగా.. ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించాడు. మరో మూడు రోజుల్లో సినిమా రిలీజ్ కానుండగా.. నేడు హైదరాబాద్‌లోని యూసఫ్ గూడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. పుష్ప తొలిరోజు రూ.300 కోట్లు వసూళ్లు చేయొచ్చని అంచనా. ఇదే నిజమైతే రూ.300 కోట్లు సాధించిన మొదటి భారతీయ చిత్రంగా నిలుస్తుంది.