Bigg Boss 8 Telugu Grand Finale: బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలో ఎప్పుడో తెలుసా.? ఇంకా ఎన్ని రోజులంటే..
Bigg Boss 8 Telugu Grand Finale: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తిగా సాగుతోంది. గత సీజన్‌లతో పోల్చితే విభిన్నంగా ఈ సీజన్‌ను ప్లాన్ చేశారు.
Bigg Boss 8 Telugu Grand Finale: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తిగా సాగుతోంది. గత సీజన్‌లతో పోల్చితే విభిన్నంగా ఈ సీజన్‌ను ప్లాన్ చేశారు. మాజీ కంటెస్టెంట్‌తో హౌజ్‌మేట్స్‌ను నామిమేట్ చేయించడం. చివరి ప్రైజ్ మనీ ఫిక్స్ చేయకపోవడం వంటి రకరకాల ట్విస్ట్‌లను ఇచ్చారు. టాస్క్‌లలో గెలిచిన ప్రతీసారీ ప్రైజ్ మనీ పెరుగుతూ వచ్చేలా ప్లాన్ చేశారు. ఇక బిగ్‌బాస్ సీజన్ 8 ప్రస్తుతం చివరి దశకు చేరుకుంటోంది.
దీంతో గ్రాండ్ ఫినాలో ఎప్పుడన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం హౌజ్‌లో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వచ్చే వారం డబుల్ ఎమిలినేషన్ ఉండనుందని సమాచారం దీంతో 5గురు హౌజ్‌మేట్స్ బిగ్‌బాస్ హౌజ్‌లో ఉండనున్నారు. వీరిలో ఒకరిని బిగ్‌బాస్ విన్నర్‌గా ప్రకటించనున్నారు. ఈ లెక్కన డిసెంబర్ 15వ తేదీ ఆదివారం బిగ్‌బాస్ గ్రాండ్ ఫైనల్ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అంటే బిగ్‌బాస్ మరో 12 రోజులు మాత్రమే ఉండనుందన్నమాట. ఈసారి గ్రాండ్ ఫినాలేను గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే స్టార్ హీరోను అతిథిగా పిలిచేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సారి ఫైనల్‌కు ఎన్టీఆర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని గతంలో వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే ఇప్పటికే టాప్5లోకి అవినాష్ ఎంట్రీ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. మిగిలిన స్థానాల్లో గౌతమ్, నబీల్, నిఖిల్ ఉండనున్నారు. ఇక ఇప్పుడున్న ముగ్గురు అమ్మాయిలు విష్ణు, ప్రేరణ, రోహిణి.. ఈ ముగ్గురిలో ఎవరు టాప్ 5కి వెళ్తారనేది తెలియాల్సి ఉంది. మరి ఈసారి విన్నర్‌గా నిలిచేది ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.