Pawan Kalayan: హరిహర వీరమల్లు షూటింగ్లో పవన్..సెట్స్‌లో దిగిన సెల్ఫీ వైరల్
Pawan Kalayan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఫుల్ బిజీగా మారారు. డిప్యూటీ సీఎంగా ఎన్నో బాధ్యతలను స్వీకరించి నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏమాత్రం గ్యాప్ దొరికినా చాలు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కబోతున్న హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేసే పనిలో ఆయన బిజీగా మారారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ ఏపీలోని మంగళగిరిలో వేసిన ఓ సెట్లో జరుగుతోంది. దీనిలో భాగంగానే మేకర్స్ ఈ మూవీకి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు.
అయితే తాజాగా పవన్ ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా హరిహర వీరమల్లు సెట్స్ లో పవన్ దిగిన సెల్ఫీని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులకు షేర్ చేశారు. ఎంతో బిజీగా ఉండే రాజకీయా షెడ్యూల్స్ నుంచి కొంత సమయం ఎన్నాళ్ల నుంచో పెండింగ్ లో ఉన్న పనులకు కేటాయించాను అంటూ పవన్ తన పోస్టులో పేర్కొన్నారు.
దీంతో ప్రస్తుతం పవన్ పోస్టు వైరల్ గా మారింది. పవన్ ఇలా సెల్ఫీ పెట్టడం..అది కూడా హరిహర వీరమల్లు సెట్స్ నుంచి పెట్టడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ మూవీ 2025 మార్చి 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.