Pushpa 3: ‘పుష్ప 3 ది ర్యాంపేజ్’ ఇక బీభత్సమే.. టైటిల్ ఇది ఫిక్స్ అయినట్లేనా..?

Pushpa 3: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Update: 2024-12-03 08:24 GMT

Pushpa 3: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప 3 మూవీ ఉంటుందని ఎప్పటి నుంచో ఒక టాక్ వినిపిస్తోంది. అది నిజం చేస్తూ తాజాగా ఓ ఫొటో బయటకు వచ్చింది. ఈ సినిమాకు సౌండ్ ఇంజనీరింగ్‌గా ఆస్కార్ అవార్డు విజేత రసూల్ పూకుట్టి పనిచేశారు. ఆయన తన టీమ్‌తో కలిసి దిగిన ఫొటో వెనుక పుష్ప 3 టైటిల్ ఉంది. అందులో పుష్ప 3: ది ర్యాంపేజ్ అని ఉండడంతో పార్ట్ 2 చివరిలో మూడో భాగానికి సంబంధించిన హింట్స్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

ఇటీవల పుష్ప 2 సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే రష్మిక ఎమోషనల్ అయింది. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంటూ ఇంకా చాలా పనులు చేయాల్సి ఉందని చెప్పుకొచ్చింది. బహుశా పార్ట్ 3 కూడా ఉంటుందనేది రష్మిక మందన్న అభిప్రాయం అయ్యుండొచ్చు అని నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో బన్నీ ఫ్యాన్స్ ఫోకస్ పుష్ప 3 పైకి వెళ్లింది. తాజాగా బయటకు వచ్చిన ఫోటోతో అది కాస్త కన్ఫ్మామ్ అయిందంటున్నారు నెటిజెన్స్. పుష్ప 3: ది ర్యాంపేజ్ అనే టైటిల్ చూస్తేనే ఆ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందోనని ఊహాగానాలు చేయడం మొదలుపెట్టేశారు ఫ్యాన్స్.

అయితే పుష్ప సినిమా హిట్ అవ్వడంతో.. దాని సీక్వెల్‌గా వస్తున్న పుష్ప 2 మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పుష్ప రెండు పార్టులు తీయడానికి ఐదేళ్లు పట్టింది. ఒకవేళ నిజంగానే పుష్ప 3 మూవీ కూడా ఉంటే.. ఆ సీక్వెల్‌కు ఇంకెంత కాలం పడుతుందో చూడాలి మరి అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

Also Read: Pushpa 2 First Review: పుష్ప 2 రివ్యూ..ట్విస్ట్ మైండ్ బ్లాకింగ్‌, పర్ఫామెన్స్ పీక్స్

Tags:    

Similar News