Actress: అందానికి మారుపేరు ఈ చిన్నారి.. ఎవరో గుర్తుపట్టారా.?

Nivetha Thomas: హీరోయిన్ల చిన్ననాటి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం ఇటీవల సర్వసాధారణంగా మారింది. పాత ఆల్బమ్‌లోని ఫొటోలను షేర్‌ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు నటీమణులు.

Update: 2024-12-03 15:30 GMT

హీరోయిన్ల చిన్ననాటి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం ఇటీవల సర్వసాధారణంగా మారింది. పాత ఆల్బమ్‌లోని ఫొటోలను షేర్‌ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు నటీమణులు. తాజాగా ఓ అందాల తార తన చిన్ననాటి ఫొటోను అభిమానులతో పంచుకుంది. క్యూట్ స్టైమ్‌ ఇస్తూ ఆకట్టుకుంటోన్న ఈ చిన్నారి ఇప్పుడో స్టార్‌ హీరోయిన్‌. ఎవరో గుర్తు పట్టారా.?

కెరీర్‌ తొలినాళ్ల నుంచి గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తూ తనదైన ముద్ర వేసిందీ బ్యూటీ. నాని నటించి తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇంతకీ చిన్నారి ఎవరో ఇప్పటికే మీకు ఓ క్లారిటీ వచ్చేసే ఉంటుంది. ఈ చిన్నారి మరెవరో కాదు అందాల తార నివేధా థామస్‌. 2008లో మలయాళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది అనతి కాలంలోనే వరుస సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది.

ఇక 2016లో నాని హీరోగా వచ్చిన జెంటిల్‌మెన్‌ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైందీ బ్యూటీ. ఈ సినిమాలో తన అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ఆ తర్వాత నిన్నుకోరితో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన నివేధాకు తర్వాత అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. 2022లో 'శాకినీ డాకినీ' తర్వాత గ్యాప్‌ తీసుకున్న నివేధా ఇటీవల '35 - ఇది చిన్న కథ కాదు' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో ఇద్దరు పిల్లలకు తల్లిగా అద్భుత నటనను కనబరిచి మెప్పించింది. తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. కాగా నివేధా తన తర్వాతి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Tags:    

Similar News