Pushpa 2: విడుదలకు ముందు షాకింగ్ ట్విస్ట్.. ఇంతకీ ఆ టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తారా..?
Pushpa 2: మరికొన్ని గంటల్లో పుష్పగాడి రూల్ మొదలు కానుంది. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కి పుష్ప2 సినిమా విడుదల కోసం యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.
Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప2 సినిమా విడుదల కానుంది.భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా 12 వేలకు పైగా స్క్రీన్‌లలో సందడి చేసేందుకు ఈ సినిమా సిద్ధమవుతోంది.
ఇదిలా ఉంటే పుష్ప2 చిత్రాన్ని 2డీ వెర్షన్‌తోపాటు 3డీలో కూడా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో పుష్ప జాతరను 3డీ చూడాలని ప్రేక్షకులు సైతం క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. అందుకు అనుగుణంగానే ముందస్తు బుకింగ్స్ కూడా జరిగిపోయాయి. అయితే తాజాగా సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది.
పుష్ప2 చిత్రాన్ని 3డీ వెర్షన్‌కు అనుగుణంగానే షూట్ చేసిప్పటికీ.. అందుకు సంబంధించిన పనులు ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం కేవలం 2డీ వెర్షన్‌కు మాత్రమే సినిమా విడుదలను పరిమితం చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ఎక్స్ వేదికగా అధికారింగా ప్రకటించారు. అయితే ఇప్పటికే 3డీ షోలకు సంబంధించి టికెట్స్ బుక్ కాగా.. ఆ షోస్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. లేదా అదే స్క్రీన్‌లో 2డీ వెర్షన్‌లో సినిమాను ప్రదర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 3డీ వెర్షన్ రావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉన్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే 3డీ టికెట్స్ బుక్ చేసుకున్న వారి పరిస్థితి ఏంటన్న అనుమానం రావడం సహజమే. అయితే 3డీ టికెట్‌తోనే 2డీ మూవీ వీక్షించే అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. 3డీ కోసం అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని ప్రేక్షకులకు తిరిగి చెల్లించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే పుష్ప2 చిత్రం ఈసారి బెంగాలీ భాషలోనూ విడుదలవుతోన్న విషయం తెలిసిందే.