Rishab Shetty: ఛత్రపతి శివాజీగా రిషబ్ శెట్టి.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్..

Rishab Shetty: కాంతార సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు హీరో రిషబ్ శెట్టి. ఇప్పటికే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ చేస్తున్న రిషబ్ శెట్టి.

Update: 2024-12-03 12:52 GMT

ఛత్రపతి శివాజీగా రిషబ్ శెట్టి.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్..

Rishab Shetty: కాంతార సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు హీరో రిషబ్ శెట్టి. ఇప్పటికే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ చేస్తున్న రిషబ్ శెట్టి.. తాజాగా మరో క్రేజీ బయోపిక్‌తో అందరినీ సర్ ప్రైజ్ చేస్తున్నారు. రిషబ్ శెట్టి నటిస్తోన్న బయోపిక్ శివాజీ మహారాజ్ సినిమా ఫస్ట్ లుక్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

ఖడ్గం చేత పట్టిన శివాజీ మహారాజ్‌గా వీరత్వం ఉట్టిపడే లుక్‌లో రిషబ్ శెట్టి క్యూరియాసిటీ పెంచేశారు. కాంతారా సినిమాతో ఆయన పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ఇప్పుడు ఈ స్టార్ హీరో కమ్ డైరెక్టర్‌కు కన్నడతో పాటు తెలుగు, హిందీ భాషల నుంచి భారీ బడ్జెట్ సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో జై హనుమాన్ సినిమాలో నటిస్తున్నారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ పాత్రలో రిషబ్ శెట్టి నటిస్తున్నారు. హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు సందీప్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

వైవిధ్యమైన పాత్రలు పోషించడంలో రిషబ్ శెట్టి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఈ సినిమాపై స్పందించిన రిషబ్ శెట్టి.. ఇది కేవలం ఒక సినిమా కాదని.. అసమానతలపై పోరాడిన శక్తివంతమైన వ్యక్తి కథ అని చెప్పారు. ఇలాంటి గొప్ప యోధుడి జీవితాన్ని తెరపై ఆవిష్కరించడంలో భాగం కావడం గర్వంగా ఉందన్నారు. ఈ సినిమా శివాజీ మహారాజ్ గురించి తెలియని ఎన్నో విషయాలను తెలియజేస్తుందన్నారు రిషబ్ శెట్టి. ఇక ఈ చిత్రం జనవరి 21, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.




 


Tags:    

Similar News