బాహుబలి కాదు.. మెగా బలి.. RGV పోస్ట్ వైరల్..
Allu Arjun RGV: దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Allu Arjun RGV: దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముక్కుసూటిగా మాట్లాడడం, తనకు సంబంధంలేని విషయాల్లో తలదూరుస్తూ వివాదాలు తెచ్చుకోవడం ఆర్జీవీకి అలవాటే. కానీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకెళ్తుంటారు ఆర్టీవీ. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
అల్లు అర్జున్ ను ఆర్టీవీ పొగడ్తలతో ముంచెత్తాడు. పుష్ప2 అల్లు అర్జున్‌కి ఉన్న క్రేజ్ గురించి చెప్తోందని.. హేయ్ అల్లు అర్జున్ నువ్వు బాహుబలి కాదు కానీ స్టార్స్ యొక్క మెగా బలి అంటూ ట్వీట్ చేశాడు ఆర్టీవీ. అంతేకాదు తాను ప్రస్తుతం ప్రొడ్యూస్ చేస్తున్న శారీ సినిమా పోస్టర్ ని షేర్ చేశారు. అయితే గత కొన్ని నెలలుగా అర్జు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్‌కి మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు ఆర్టీవీ చేసిన ట్వీట్ పై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2: ది రూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. వరల్డ్ వైడ్‌గా దాదాపు 12500 స్క్రీన్స్‌లో రిలీజ్ కాబోతోంది. దీంతో పుష్ప2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.