మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్న చైతూ-శోభిత
Naga Chaitanya-Sobhita Dhulipala Wedding: అక్కినేని నాగ చైతన్య, నటి శోభిత ధూళ్లిపాళ బుధవారం వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. రాత్రి 8.13 నిమిషాలకు అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహం జరగనుంది.
Naga Chaitanya-Sobhita Dhulipala Wedding: అక్కినేని నాగ చైతన్య, నటి శోభిత ధూళ్లిపాళ బుధవారం వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. రాత్రి 8.13 నిమిషాలకు అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహం జరగనుంది. చాలా సింపుల్ గా కొద్దిమంది బంధువులు, ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే హాల్ది వేడుక, మంగళ స్నానాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చైతూ-శోభితను ఆశీర్వదించడానికి కేవలం అతికొద్ది మంది మాత్రమే హాజరు కాబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులతో పాటు డైరెక్టర్లు, రాజకీయ నాయకులు హాజరుకాబోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా మెగా కుటుంబ సభ్యులు పెళ్లికి హాజరుకాబోతున్నట్టు తెలుస్తోంది. ఇంకా ఎన్టీఆర్, రాజమౌళి, ప్రభాస్, మహేష్ బాబు దంపతులు, అల్లు అర్జున్ ఫ్యామిలీ రాఘవేంద్రరావు, కోలీవుడ్ నుంచి నయన్-విఘ్నేష్ దంపతులు కూడా ఈ వివాహ వేడుకకు హాజరుకానున్నారని సమాచారం. వీరితో పాటు మరికొందరు ప్రముఖులు హాజరుకానున్నట్టు తెలుస్తోంది.
ఈ ఏడాది అక్కినేని వారి ఇంట రెండు శుభవార్తలు వినిపించాయి. ఒకటి నాగచైతన్య పెళ్లితో పాటు అఖిల్ ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది. ఇక అఖిల్ వివాహం వచ్చే యేడాది జరగబోతున్నట్టు నాగార్జున తెలియజేశారు.