Pushpa 2 @ Sandhya theatre: సంధ్య థియేటర్ వద్ద పుష్పరాజ్... అల్లు అర్జున్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదుగా
Allu Arjun reaches Sandhya theatre to watch Pushpa 2 movie: పుష్ప 2 మూవీ రేపు డిసెంబర్ 5న విడుదల కానుంది. అయితే, ముందు రోజు రాత్రి నుండే.. అంటే ఇవాళ రాత్రి నుండే బెనిఫిట్ షోలు అల్లు అర్జున్ అభిమానులను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్యా థియేటర్ లో పుష్ప 2 మూవీ చూడ్డానికి అల్లు అర్జున్ వచ్చాడు. అభిమానులతో కలిసి పుష్ప 2 సినిమా ఎంజాయ్ చేసేందుకు వచ్చిన అల్లు అర్జున్ కు అక్కడ ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. మామూలుగానే పుష్ప 2 సినిమా ప్లే అయ్యే థియేటర్ల వద్ద భారీగా జన సందోహం ఉన్నారు. దానికితోడు అల్లు అర్జున్ కూడా రావడంతో సంధ్య థియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు.
భారీ అభిమాన సందోహం మధ్యే తన కారు దిగిన అల్లు అర్జున్ అతి కష్టం మీద సంధ్య థియేటర్‌లోకి కాలు పెట్టారు. అల్లు అర్జున్ కు భద్రత కల్పించడం పోలీసులు, పర్సనల్ సెక్యురిటీ స్టాఫ్, బౌన్సర్లకు కత్తి మీద సాములా మారింది.