Pushpa 2 movie: పుష్ప 2 సినిమాకు సాయి ధరమ్ తేజ్ విషెస్

Update: 2024-12-04 15:09 GMT

Sai Dharam Tej wishes Allu Arjun for Pushpa 2 success: అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప2 మూవీ ఇంకొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది. అయితే అల్లు-మెగా కుటుంబాల మధ్య విభేదాలు నెలకొన్నాయని.. వాటి వల్ల అల్లు అర్జున్ సినిమాకు మెగా ఫ్యామిలీ దూరంగా ఉంటూ వస్తుందనే టాక్ నడుస్తోంది. కానీ తాజాగా మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, నటుడు సాయి ధరమ్ తేజ్ పుష్ప 2 మూవీకి విషెస్ చెబుతూ ట్వీట్ చేశాడు. అది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

పుష్ప2 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావాలంటూ హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ విష్ చేస్తూ ట్వీట్ చేశాడు. అందులో అల్లు అర్జున్ పేరును ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. మరోవైపు సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్ కేవలం సాంప్రదాయంగా చేశారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇండస్ట్రీలో రిలీజ్ అయ్యే సినిమాలకు తేజ్ సోషల్ మీడియా ద్వారా విష్ చేస్తూ ఉంటారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా మూవీ హిట్ కావాలని కోరుతూ ట్వీట్ చేస్తాడు. మరి ఇప్పుడు పుష్ప2 విషయంలో కూడా అదే సాంప్రదాయంతో ట్వీట్ చేశారా? లేక గత కొంతకాలంగా అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అంటూ వస్తున్న వార్తలకు బ్రేక్ వేస్తూ ట్వీట్ చేశారా అనేది చర్చకు దారి తీసింది.

ఎలక్షన్ సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేక వర్గమైన వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య వివాదం మొదలైందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే సాయి ధరమ్ తేజ్ ఆ టైంలో బన్నీని ట్విట్టర్‌లో అన్‌ఫాలో చేశారని టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో పుష్ప2 హిట్ కావాలంటూ ధరమ్ తేజ్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ట్వీట్‌కు అల్లు అర్జున్ రెస్పాండ్ అవుతాడా అనేది చూడాలి మరి.

Tags:    

Similar News