Pushpa 2: ఫ్యాన్స్‌తో కలిసి పుష్ప2 ప్రీమియర్ షో చూడబోతున్న అల్లు అర్జున్
Allu Arjun to watch Pushpa 2 movie along with fans: పుష్ప 2 మూవీ రాక కోసం ఎగ్జైట్‌గా ఎదురుచూస్తోన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ఈ న్యూస్ ఎక్కడా లేని జోష్‌ను అందిస్తోంది.
Allu Arjun to watch Pushpa 2 movie along with fans: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అంతకంటే ముందుగా డిసెంబర్ 4 రాత్రి కొన్నిచోట్ల ప్రీమియర్ షోలు వేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో కలిసి సందడి చేయనున్నారని సమాచారం. రాత్రి 9.30 గంటల షోకి అల్లు అర్జున్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న సంధ్య 70mm థియేటర్లో ఫ్యాన్స్‌తో కలిసి పుష్ప2 సినిమా చూడబోతున్నారు. దీంతో రాత్రికి సంధ్య థియేటర్ వద్దకు బన్నీ ఫ్యాన్స్ భారీగా వచ్చే ఛాన్స్ ఉంది.
ఇప్పటికే పుష్ప 2 మూవీ రాక కోసం ఎగ్జైట్‌గా ఎదురుచూస్తోన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ఈ న్యూస్ ఎక్కడా లేని జోష్‌ను అందిస్తోంది. సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప2 మూవీలో అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ రెడ్ శాండల్ స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో పుష్ప 1 కు మించిన పర్‌ఫార్మెన్స్ చూపించనున్నాడు. పుష్పరాజ్‌కు భార్యగా శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన నటించింది.
పుష్ప రాజ్ రెడ్ శాండల్ స్మగ్లింగ్‌ను అడ్డుకునే పోలీసు అధికారి భన్వర్ సింగ్ షెఖావత్ పాత్రలో మళయాలం నటుడు ఫహద్ ఫాజిల్ కనిపించనున్నాడు. ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ ఈ సినిమాకు మరో అసెట్‌గా పుష్ప 2 యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
పుష్ప 2 మూవీ మొత్తం క్యాస్టింగ్ విషయానికొస్తే... జగపతి బాబు, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, యాంకర్ అనసూయ భరద్వాజ్, ఐటం సాంగ్ కోసం ఐటం గాళ్‌గా శ్రీలీల.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామందే ఉన్నారు.