GOAT: విజయ్‌ 'గోట్‌'లో మరో సర్‌ప్రైజ్‌.. స్పెషల్‌ రోల్‌లో క్రికెటర్‌

సెప్టెంబర్‌ 5వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

Update: 2024-09-04 15:27 GMT

GOAT: విజయ్‌ 'గోట్‌'లో మరో సర్‌ప్రైజ్‌.. స్పెషల్‌ రోల్‌లో క్రికెటర్‌

స్టార్‌ హీరో విజయ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'ది గోట్‌'. భారీ అంచనాల నడుమ యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిందీ మూవీ. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. విజయ్‌ ఈ సినిమాలో డ్యూయల్‌ రోల్‌లో నటిస్తుండడం, భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించడంతో గోట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు అనుగుణంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తున్నారు.

సెప్టెంబర్‌ 5వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే విడుదల తేదీ దగ్గరపడ్డ తరుణంలో చిత్ర యూనిట్‌ ఓ ఆసక్తికర అప్‌డేట్‌ను వెల్లడించింది. గోట్‌ చిత్రంలో ఓ క్రికెటర్‌ నటిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మాజీ ఇండియన్‌ క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్ జట్టుకు చెందిన క్రికెటర్‌ ఈ చిత్రంలో నటించాడని వార్తలు వచ్చాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం దీనిపై స్పందించలేదు.

ఇదిలా ఉంటే సినిమా విడుదల దగ్గపడ్డ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. గత కొన్ని రోజులుగా వచ్చిన వార్తను నిజం చేస్తూ.. మాజీ ఇండియన్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ ఓ పోస్ట్ చేశాడు. ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ముగించినట్లుగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఇంతకీ బద్రీనాథ్‌ ఈ సినిమాలో ఏ పాత్రలో నటించనున్నాడన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి బద్రీనాథ్ పాత్ర ఏంటో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.


Similar News