రేపు మెహబూబ్ విన్నర్ అయినా షాక్ అవ్వొద్దు : కళ్యాణి

kalyani Interview with HMTV : అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మంచి రసవత్తరంగా సాగుతుంది. 16 మంది కంటెస్టెంట్స్‌తో మొదలైన ఈ షోలో ఇప్పటికి అరుగురు ఎలిమినేట్ అయ్యారు.

Update: 2020-10-13 15:22 GMT

kalyani Interview with HMTV : అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మంచి రసవత్తరంగా సాగుతుంది. 16 మంది కంటెస్టెంట్స్‌తో మొదలైన ఈ షోలో ఇప్పటికి అరుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇందులో మొదటివారం ఎలిమినేషన్ లో సూర్యకిర‌ణ్ వెళ్ళగా, రెండోవారం కరాటే క‌ళ్యాణి, మూడోవారం దేవి నాగ‌వ‌ల్లి, నాలుగో వారం స్వాతి దీక్షిత్, అయిదోవారం సుజాత ఎలిమినేట్ అయ్యారు. అయితే ఎలిమినేషన్ లో గంగవ్వ లేకపోయినప్పటికీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆమెను హౌస్ నుంచి బయటకు వెళ్ళవలసి వచ్చింది. దీనితో మొత్తం ఆరుగురు సభ్యులు హౌస్ నుంచి వెళ్ళిపోయారు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా HMTV కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కరాటే కళ్యాణి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హౌస్ లోని కంటెస్టెంట్స్‌ కి వచ్చే ఓట్లకి ఎలిమినేట్ అయ్యే వారికీ అసలు సంబంధం లేదని కరాటే కళ్యాణి అన్నారు. ఎలిమినేషన్ లో చాలా గందరగోళంగా ఉందని అన్నారు. దేవి నాగవల్లి ఎలిమినేషన్ అయ్యే ముందు రోజు మీడియాలో మెహబూబ్ అవుట్ అంటూ వార్తలు వచ్చాయని, తీరా చూస్తే దేవి నాగవల్లి హౌస్ ని బయటకు వచ్చిందని, ఇది తనని షాక్ కి గురిచేసిందని అన్నారు కళ్యాణి.. ఇక తానూ ఎలిమినేషన్ కి ముందు అమ్మ రాజశేఖర్, తానూ ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఉంటే తానూ ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చానని, కానీ తనకి వచ్చిన ఓట్లను అస్సలు చెప్పలేదని కళ్యాణి అన్నారు.

ఇక సుజాత విషయంలో కూడా అమ్మ రాజశేఖర్ తో ఎలిమినేషన్ లో ఉన్నప్పటికి సుజాత ఓట్ల పరంగా ముందుంది కానీ సుజాత ఎలిమినేట్ అయిందని కళ్యాణి వెల్లడించింది. అటు మోనాల్ ను హౌస్ లో ఇంకా కంటిన్యూ చేస్తారని, వీకెండ్ షోలో గ్లామర్ కోసం అయిన అమెను షోలో కొనసాగిస్తారని అంటూ కళ్యాణి కామెంట్స్ చేసింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో మెహబూబ్ ని సేవ్ చేసే అధికారాన్ని కెప్టెన్ కి కొత్తగా ఎలా ఇస్తారని కళ్యాణి ప్రశ్నించారు. రేపు మెహబూబ్ కెప్టెన్ అయినా  విన్నర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన  అవసరం లేదని కళ్యాణి అన్నారు. 


Full View


Tags:    

Similar News