BB5 Highlights: టాస్క్ లో ఓడినా ప్రేక్షకుల మనసు గెలిచిన సన్నీ, మానస్

* బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు గురువారం ఎపిసోడ్ హైలైట్స్

Update: 2021-10-15 06:44 GMT
Bigg Boss Season 5 Telugu Thursday Episode Highlights 14th October 2021 | Bigg Boss 5 Updates

బిగ్ బాస్ సీజన్ 5  (ఫోటో: స్టార్ మా)

  • whatsapp icon

BB5 Highlights: బిగ్ బాస్ సీజన్ 5 గురువారం బిబి బొమ్మల ఫ్యాక్టరీ కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ప్రియ టీంకి వచ్చిన అవకాశంతో శన్ముఖ్ జస్వంత్ టీం బొమ్మల నుండి సగం బొమ్మలను వేస్ట్ బిన్ లో వేయడంతో కెప్టెన్సీ పోటీకి దూరమవుతారు. ఆ తరువాత సంచాలక్ గా కాజల్, సిరి హనుమంత్ లు తమ పనులను నిర్వర్తించలేకపోయినందున వారిద్దరితో పాటు రవి టీం కూడా బిగ్ బాస్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసినందుకు ఆ టీంని కూడా కెప్టెన్సీ పోటీదారుల నుండి తప్పించి సన్నీ, ప్రియ టీమ్స్ ని బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీదారులుగా ప్రకటిస్తాడు.

ఇక సన్నీ ఒక్కసారి నన్ను కెప్టెన్ చేయండి.. నేను తెచ్చుకున్న కెప్టెన్ డ్రెస్ వేసుకుంటాను అంతేకాకుండా హౌస్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తానంటూ బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేస్తాడు. కాజల్ ని టాస్క్ సమయంలో ఎలా నడిచిందో ఫన్నీగా చూపిస్తూ విజె సన్నీ ఇంటి సభ్యులను నవ్వించాడు. ఇసుకతో ఆట అంత ఈజీ కాదు బేటా కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా పాల్గొన్న ప్రియ, సన్నీ టీమ్స్ లో చివరికి విశ్వా విజేతగా నిలిచి ఈ వారం ఇంటి కెప్టెన్ గా నియమించబడుతాడు.

ఆ తరువాత రేషన్ మేనేజర్ కోసం జరిగిన టాస్క్ లో విజె సన్నీ, మానస్, ప్రియాంక సింగ్ లు ఫన్నీగా ఆడిన గేమ్ లో చివరికి మానస్.. ప్రియాంకకి సపోర్ట్ చేసి ఆమెని గెలిపిస్తాడు. ఇక ప్రియాంక సింగ్, సిరి హనుమంత్, కాజల్, ప్రియలు మానస్ గురించి తమాషాగా మాట్లాడుకోవడం గురువారం ఎపిసోడ్ లో చూడవచ్చు.

Tags:    

Similar News