Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగు కొత్త హోస్టుగా రానా...?

Bigg Boss 5 Telugu: సీజన్ 5 నుంచి నాగార్జున స్థానంలో దగ్గుబాటి హీరో రానా వచ్చి చేరబోతున్నాడని సమాచారం.

Update: 2021-06-29 04:21 GMT
Bigg Boss-5 Telugu Nagarjuna Akkineni Replacing With Rana Hero as Host

Bigg Boss 5 Telugu:(File Image) 

  • whatsapp icon

Bigg Boss 5 Telugu: ఎన్ని వివాదాలు వస్తున్నప్పటికీ బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించేందుకు మళ్లీ బిగ్ బాస్ 5 ప్రారంభానికి అంతా సిద్ధం అయ్యింది. బిగ్ బాస్ ఐదవ సీజన్ మొదలవనుందనే ప్రచారంతో ముందుగా అందరి మదిలో మెదిలిన ప్రశ్న ఈ సీజన్ హోస్ట్ ఎవరు అని. తొలి సీజన్ లో ఎన్టీఆర్ మొదలెట్టిన హవాను, రెండవ సీజన్ నాని, మూడు, నాల్గవ సీజన్ వరకు సీనియర్ హీరో నాగార్జున తనదైన శైలిలో ఆసక్తికరంగా మార్చి ప్రేక్షకులకు చేరువ చేశాడు. కానీ ఈ సీజన్ హోస్ట్ మారనున్నాడే వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.

సీజన్ 5 నుంచి నాగార్జున తప్పుకుంటున్నాడని.. ఆయన స్థానంలో దగ్గుబాటి హీరో రానా వచ్చి చేరబోతున్నాడని తెలుస్తుంది. దీనికి ప్రత్యేకంగా కూడా కారణాలేం లేవు. నాగార్జున ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. కరోనా కారణంగా చేయాల్సిన సినిమాలు.. ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ అలాగే పెండింగ్‌లో పడిపోయాయి. ఈ సమయంలో బిగ్ బాస్ 5 కోసం డేట్స్ కేటాయించడం కష్టంగా మారిపోయింది. అందుకే ఈ ఒక్క సీజన్‌కు ఈయన దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని నిర్వాహకులకు చెప్పి తప్పుకున్నట్లు తెలుస్తుంది.ఉన్నట్లుండి నాగార్జున తీసుకున్న ఈ నిర్ణయంతో బిగ్ బాస్ నిర్వాహకులు కూడా షాకయ్యారట. ఈ స్థానంలో రానా దగ్గుబాటిని తీసుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

బుల్లితెరపై రానాకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. నెం 1 యారీతో ఇప్పటికే రికార్డులు సృష్టించాడు రానా. దాంతో పాటు హోస్టుగానూ మంచి అనుభవం ఉంది. అందుకే రానా అయితే బిగ్ బాస్ 5 తెలుగును బాగా లీడ్ చేస్తాడని నిర్వాహకులు కూడా నమ్ముతున్నారు. దీనికోసం స్టార్ మా ఈ హీరోకు భారీ మొత్తమే చెల్లించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీని పై బిగ్ బాస్ అధికారులు అఫిషియల్ గా ప్రకటిస్తే గానీ హోస్ట్ పై క్లారిటీ వస్తుంది.

Tags:    

Similar News