Bhanumathi and Ramakrishna Movie Review: భానుమతి & రామకృష్ణ రివ్యూ!
Bhanumathi and Ramakrishna Movie Review: కరోనా నేపథ్యంలో ధియేటర్లు ఓపెన్ కాకపోవడంతో సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Bhanumathi and Ramakrishna Movie Review: కరోనా నేపథ్యంలో ధియేటర్లు ఓపెన్ కాకపోవడంతో సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కీర్తి సురేష్ పెంగ్విన్, సిద్దు హీరోగా నటించిన కృష్ణ అండ్ హీజ్ లీలా మొదలగు చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయి మంచి టాక్ ను సంపాదించుకున్నాయి. తాజాగా ఈరోజు ( జులై 3న) అల్లు వారి 'ఆహా' ఓటీటీ ప్లాట్‌ఫాంలో 'భానుమతి & రామకృష్ణ' అనే సినిమా విడుదలైంది..ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం..
కథ :
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రేమ కథలు కొత్తేమి కాదు.. కొత్తదనం చూపిస్తే ప్రేక్షకులు ఎవ్వరైనా ఫిదా అవుతారు.. అలాంటి రొమాంటిక్ ప్రేమ కథే ఈ 'భానుమతి & రామకృష్ణ' .. ఇక కథలోకి వెళ్తే.. భానుమతి (సలోని లూత్రా) ఆత్మాభిమానం ఎక్కువగా ఉన్న అమ్మాయి.. ఓ అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది. ఐదేళ్ల పాటు తనతో ప్రేమలో ఉన్న రామ్ (రాజా చెంబోలు) కూడా తనను విడిచిపెట్టి వెళ్లిపోతాడు. ఈ నేపథ్యంలో భానుమతితో కలిసి పని చేయడానికి ఆమె టీంలోకి రామకృష్ణ (నవీన్ చంద్ర) వస్తాడు. భానుమతికి పూర్తి విరుద్ధంగా ఉన్న రామకృష్ణ పై తొలిపరిచయం లొనే భానుమతికి అస్సలు నచ్చాడు. ఈ క్రమంలో రామకృష్ణ ఆమెకి ఎలా దగ్గరయ్యాడు. వారిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది అన్నది సినిమా కథ..
ఎలా ఉందంటే ?
మోడర్న్ అమ్మాయి, నెమ్మదస్తుడైన అబ్బాయి.. మొదట్లో అతడిని చూస్తేనే ఇరిటేషన్.. కానీ అతని అమాయకత్వం నచ్చి ఆ అమ్మాయి ప్రేమలో పడడం.. మధ్యలో ఓ ట్విస్ట్.. చివరకి కథ సుఖాంతం.. ఇలా ఫార్మాట్ లలో చాలా సినిమాలు వచ్చాయి.. అందులో ఈ భానుమతి &రామకృష్ణ కూడా ఒకటి..కథ, కథనాలు కొత్తగా ఏం అనిపించవ్ కానీ ఆ భానుమతి, రామకృష్ణ అనే రెండు పాత్రలు మాత్రం ప్రేక్షకులను అల కూర్చోబెడతాయి.. వాళ్ళిద్దరి మధ్య ప్రేక్షకులకు మంచి ఫీల్ ఇస్తుంది. చిన్న చిన్న భావోద్వేగాలతో దర్శకుడు సినిమాని నడిపించిన విధానం బాగుంది. మధ్యలో హర్ష కామెడీ బాగా ఆకట్టుకుంటుంది. ఇక సినిమా నిడివి తక్కువగా ఉండటం సినిమాకి మరో ప్లస్ అని చెప్పవచ్చు..
ఎవరు ఎలా చేశారంటే ?
సినిమాకు ప్రధాన బలం నవీన్ చంద్ర, సలోనీ లూత్రా పాత్రలే .. ఈ పాత్రలే సినిమాని ఆసక్తికరంగా ముందుకు నడిపించాయి. నవీన్ చంద్ర అయితే ఇప్పటివరకు కనిపించని పాత్రలో కనిపించి మెప్పించాడు.ఇక మోడరన్ అమ్మాయి పాత్రలో సలోని చక్కగా నటించింది. హర్ష కామెడీ ఆకట్టుకుంటుంది..ఇక మిగత పాత్రలు తమ పాత్రల మేరకు బాగానే ఆకట్టుకున్నారు.
టెక్నీకల్ గా ఎలా ఉంది?
చాలా క్వాలిటీగా సినిమాని చేశారు మేకర్స్.. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది.శ్రవణ్ భరద్వాజ్ అందించిన పాటలు, నేపధ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక తొలి సినిమాతో శ్రీకాంత్ అద్భుతం చేయకపోయిన ఆకట్టుకున్నాడు.
చివరగా : సున్నితమైన ప్రేమ కథలను ఇష్టపడే వారికి భానుమతి & రామకృష్ణ ఆకట్టుకుంటుంది.