Game Changer Twitter Review: దుమ్మురేపిన గేమ్ ఛేంజర్..సెకండాఫ్ నెవ్వర్ బిఫోర్..ఊరమాస్ అంటూ.. ఫ్యాన్స్ ఖుషీ
Game Changer Twitter Review: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ గేమ్ ఛేంజర్… థియేటర్లలోకి వచ్చింది. చెర్రీ ఫ్యాన్స్ కు అప్పుడే సంక్రాంతి పండుగ షురూ అయ్యింది. సంక్రాంతికి ముందుగా రిలీజ్ అయిన ఈ భారీ సినిమాకి తెల్లవారుజాము నుంచే ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నారు. ఏ థియేటర్ చూసినా ఫ్యాన్స్ కోలాహలమే కనిపిస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసిన వాళ్ళు ఏమంటున్నారు ట్విట్టర్ రివ్యూ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మూవీ రామ్ చరణ్ వన్ మ్యాన్ షో గా నడిపించాడని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. విభిన్న పాత్రలో ఒదిగిపోతూ.. నటనలో మరో మెట్టు పైకి ఎక్కాడు అంటూ సంబరపడుతున్నారు. ముఖ్యంగా ఇది గేమ్ చేంజర్ మాత్రమే కాదు.. రామ్ చరణ్ కి కెరీర్ చేంజ్ అని కూడా ఈ సినిమా చూసిన వాళ్లంతా చెబుతున్నారు. దర్శకుడు శంకర్ మరోసారి తన మార్క్ చూపించారని.. కమ్ బ్యాక్ ఇచ్చారని అంటున్నారు. నటీనటులు , కథ, కథనం, పెర్ఫార్మెన్స్, టెక్నికల్ అంశాల్లో ఈ సినిమా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని ఫ్యాన్స్ అంటున్నారు .
రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ చింపేసాడు అని సన్నివేశాలు తగినట్లుగా ఒక్కోసారి డౌన్ అవుతూ.. మరోసారి హై పిచ్ కి వెళ్తూ నటనలో ఎంతో వైవిధ్యం చూపించారని చెబుతున్నారు.
ఇక ప్రతి సినిమాలో తన మార్కు చూపిస్తున్న ఎస్ జె సూర్య.. ఈ మూవీలో కూడా రాజకీయ నాయకుడిగా అద్భుతమైన పాత్ర పోషించారట. కైరా అద్వానీ, అంజలి తమతమ పాత్రలకు న్యాయం చేశారని చెబుతున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో సాంగ్స్, విజువల్స్ బిగ్ స్క్రీన్ పై ట్రీట్ ఇస్తున్నాయంటున్నారు. చాలా సీన్లు బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ చేసిందని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
మొత్తంగా ఈ మూవీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా శంకర్ మార్కుతో ఉందని చూసినవాళ్లు అంటున్నారు.
ఇక తన పాత్రను మనసుపెట్టి చేసే రామ్ చరణ్.. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన సినిమా అంచనాలను అందుకోవడమే కాదు ఇటు రాంచరణ్ మరింత ప్లస్ అవడమే కాకుండా అటు శంకర్ కి మళ్ళి లైఫ్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. భారతీయుడు 2 శంకర్ కి కొంత షాక్ ఇచ్చింది. దాంతో ఈ మూవీపై ఆయన ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇది పూర్తిగా కమర్షియల్ లుక్ తో వచ్చింది. భారీగా ఖర్చు చేశారు. అదంతా స్క్రీన్ పై కనిపిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.