నాగ చైతన్య - సమంత విడిపోతారు అని ముందుగానే చెప్పిన జ్యోతిష్కుడు

* సమంత నాగ చైతన్య విడిపోతే ఇదే జరుగుతుంది అంటున్న జ్యోతిష్కుడు

Update: 2021-10-02 11:45 GMT
Astrologer Venu Swamy Says Before about Naga Chaitanya and Samantha Breakup News

నాగచైతన్య - సమంత(ట్విట్టర్ ఫోటో)

  • whatsapp icon

Naga Chaitanya - Samantha Divorce: అభిమానుల మనసు విరిచేస్తూ సమంత మరియు నాగచైతన్య విడిపోయారు. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని వీరు త్వరలో విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇవాళ తను సమంతతో విడిపోయినట్లు నాగచైతన్య అధికారికంగా ప్రకటించారు.

ఇక మీదట తాను సమంత భార్య భర్తలు కామని, అయినప్పటికీ వారి బంధం ఎప్పటికీ స్పెషల్ గానే ఉంటుందని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు నాగ చైతన్య. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యం నిజమైంది అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వీడియో వైరల్ గా మారింది.

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆస్ట్రాలజర్ వేణు స్వామి నాగచైతన్య సమంత త్వరలోనే విడిపోతున్నట్లు గా తెలిపారు. వారిద్దరూ కలిసి ఉండాలని తాను కూడా కోరుకుంటున్నానని, కానీ ఒకవేళ వారు గనక విడిపోతే మాత్రం నాగచైతన్య టాలీవుడ్ లోనే స్టార్ రేంజ్ కి వెళ్ళి పోతాడు అని ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంతా మాత్రం కెరియర్లో డౌన్ అయిపోతుందని అన్నారు.

"లవ్ స్టోరీ" సినిమా తరువాత నుంచి నాగచైతన్య ఆ దశ తిరిగిపోతుంది అని, కెరీర్ లో తాను జెట్ స్పీడ్తో ముందుకు వెళతారని జ్యోతిష్యం చెప్పారు వేణు స్వామి. మరి నాగ చైతన్య కెరీర్ విషయంలో ఆయన జోతిష్యం ఏమాత్రం నిజమవుతుందో చూడాలి.

Tags:    

Similar News