Arjun Sarja: బాలకృష్ణ కోసం విలన్ గా మారిన నటుడు

Arjun Sarja: బాలకృష్ణ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఒకప్పటి హీరో

Update: 2021-12-31 12:30 GMT
Arjun Sarja Acting with Balakrishnas New Film | Tollywood News

బాలకృష్ణ కోసం విలన్ గా మారిన నటుడు

  • whatsapp icon

Arjun Sarja: ఈమధ్యనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో "అఖండ" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో శృతిహాసన్ కనిపించబోతున్నట్లు దర్శకనిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఒకప్పుడు హీరోగా మంచి పేరు తెచ్చుకున్న అర్జున్ సర్జా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అక్కడక్కడా కొన్ని సినిమాలలో కనిపిస్తున్నారు. ఇప్పుడు అర్జున్ కు ఒక సీనియర్ హీరో సినిమాలో విలన్ గా చేసే అవకాశం వచ్చింది.

శ్రీ ఆంజనేయం, రామ రామ కృష్ణ కృష్ణ, నాపేరు సూర్య వంటి సినిమాలలో అర్జున్ సర్జా మంచి పాత్రలు పోషించినప్పటికీ అవేమీ అనుకున్న విజయాన్ని సాధించలేకపోయాయి. ఇక తాజాగా ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అర్జున్ బాలకృష్ణ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరి ఈ సినిమాతో అయినా అర్జున్ మంచి విజయాన్ని సాధిస్తారు లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Tags:    

Similar News