Allu Arjun: బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

అల్లు అర్జున్ (Allu Arjun) బెయిల్ పిటిషన్ పై విచారణను 2025 జనవరి 3కు వాయిదా వేసింది నాంపల్లి కోర్టు.

Update: 2024-12-30 07:05 GMT

Allu Arjun: బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

అల్లు అర్జున్ (Allu Arjun) బెయిల్ పిటిషన్ పై విచారణను 2025 జనవరి 3కు వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ డిసెంబర్ 24న ఆయన నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ ను కొట్టివేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడానికి అల్లు అర్జున్ కారణమని ఆయన వాదించారు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు.

అల్లు అర్జున్ ను డిసెంబర్ 13న చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజున హైకోర్టు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది. ఈ సూచన మేరకు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేశారు.

ఈ నెల 27న నాంపల్లి కోర్టు ముందు వర్చువల్ గా అల్లు అర్జున్ హాజరయ్యారు. జ్యుడిషీయల్ రిమాండ్ పై జనవరి 10న విచారణ చేస్తామని కోర్టు తెలిపింది. విచారణను అదే రోజుకు వాయిదా వేసింది.  పుష్ప 2 బెనిఫిట్ షో ప్రదర్శన సమయంలో అల్లు అర్జున్ నిర్వహించిన రోడ్ షో కారణంగానే తొక్కిసలాట జరిగిందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆయనను విచారించారు.

సంధ్య థియేటర్ ఘటన తర్వాత ఈ నెల 26న హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రో ల్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు సమావేశమయ్యారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని సీఎం హామీ ఇచ్చారు.


Tags:    

Similar News