Adavi Shesh Marriage: నాగార్జున మేనకోడలితో అడవి శేష్ పెళ్లి..?
Adavi Shesh Marriage: యంగ్ హీరో శర్వానంద్ జూన్3న పెళ్లి చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇదే నెలలో మరో యంగ్ హీరో సైతం ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆ యంగ్ హీరో మరెవరో కాదు అడవి శేష్.
Adavi Shesh Marriage: యంగ్ హీరో శర్వానంద్ జూన్3న పెళ్లి చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇదే నెలలో మరో యంగ్ హీరో సైతం ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆ యంగ్ హీరో మరెవరో కాదు అడవి శేష్. ఇక పెళ్లి చేసుకునేది కూడా మరెవరినో కాదు అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియనే.
అడవిశేష్, సుప్రియ ప్రేమించుకుంటున్నారని గత కొంత కాలంగా టాలీవుడ్ లో రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ రూమర్లకు తగ్గట్టే అక్కినేని ఫ్యామిలీలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో అడవి శేష్ పాల్గొనడమే కాకుండా సుప్రియ పక్కనే కూర్చున్నాడు. ఇక రామ్ చరణ్ బర్త్ డే వేడుకలకు సైతం సుప్రియ, అడవిశేష్ జంటగా ఒకే కారులో విచ్చేశారు. దీంతో వీళ్లిద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారని టాక్ జోరు అందుకుంది. అడవిశేష్, సుప్రియ పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ వీరి పెళ్లికి అడవి శేష్ కుటుంబసభ్యుల నుంచి అంగీకారం లభించలేదు. కానీ, వీళ్ల పెళ్లికి తాజాగా ఇరు కుటుంబసభ్యులు ఒకే చెప్పడమే కాకుండా పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు.
ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం మేరకు..అడవిశేష్, సుప్రియల వివాహం జూన్ 16న జరగనుంది. వీరి పెళ్లిని అక్కినేని నాగచైతన్య దగ్గరుండి నిర్వహించనున్నాడట. అతడే పెళ్లి పెద్దని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా, గత కొంత కాలంగా కొనసాగిస్తున్న లివ్ ఇన్ రిలేషన్ షిప్ ని అడవిశేష్, సుప్రియ ఫుల్ స్టాప్ పెట్టేసి..వివాహబంధంతో కొత్త ఇన్నింగ్స్ కి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇకపోతే అడవిశేష్ ప్రస్తుతం గూఢచారి సినిమాకి సీక్వెల్ చేస్తున్నాడు.