దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరు 'ఓంపురి'. ఓంపురి సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేకంగా పేజీలు ఏర్పరుచుకున్నారు. విలక్షణ నటనతో ప్రేక్షకజన హృదయాల్లో ఆయనది చెరగని ముద్ర వేసారు. 'ఆక్రోష్', 'తమస్', 'మాచిస్', 'ఆరోహణ్', 'అర్ధ్ సత్య', 'పార్టీ, 'ద్రోహ్‌కాల్', 'గుప్త్', 'బాలీవుడ్ కాలింగ్' చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు పోషించారాయన. ఓంపురి తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. తెలుగులో వచ్చిన 'అంకురం'లో సత్యం పాత్రలోనూ, రామ్‌గోపాల్ వర్మ 'రాత్రి'లో మాంత్రికుడి పాత్రలో ఆయన ప్రేక్షకుల్ని అలరించారు. ఈయన నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో 2017 జవనరి 6నే కన్నుమూసారు. కాగా.. అయన నటించిన సినిమా విడుదలకు సిద్దంగా వుంది.
ఓం పురి హరియాణాలోని అంబాలాలో ఓ పంజాబీ కుటుంబంలో జన్మించారు. ఆంగ్లంతో పాటు, పాకిస్థానీ చిత్రాల్లోనూ ఆయన కీలకమైన పాత్రలు పోషించారు. సినిమాలతో పాటు నాటకరంగంలోనూ ఆయన తన ముద్రవేశారు. 1976లో వచ్చిన మరాఠీ చిత్రం 'ఘాశీరామ్ కొత్వాల్'తో ఆయన వెండితెరకొచ్చారు. ఆయన నటించిన పాత్రలే ఓం పురికి గుర్తింపును తెచ్చిపెట్టాయి. హిందీతో పాటు మరాఠీ, తెలుగు, కన్నడ, మలయాళం, పంజాబీ భాషల్లోనూ నటించారు. అందులో 'ఆరోహణ్' 'అర్ధసత్య' చిత్రాల్లో నటనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు.
ఇక ఓంపురి చనిపోయేనాటికి పలు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. ఈయన కన్నుమూసిన తర్వాత 'వైస్ రాయ్ హౌస్', ట్యూబ్ లైట్' చిత్రాలు విడుదలయ్యాయి. ఇందులో సల్మాన్ ఖాన్ కథానాయికుడు. ఇక ఈయన నటించిన చివరి చిత్రం 'ఓం ప్రకాష్ జిందాబాద్'. 'రామ్ భజన్ జిందాబాద్' అనే టైటిల్ అనుకున్న ఓంపురి పై గౌరవంతో 'ఓం ప్రకాష్ జిందాబాద్'గా పేరు మార్చి విడుదల చేసారు. మరాఠీ భాషలో తెరకెక్కిన ఈ చిత్రం 18 డిసెంబర్ 2020లో విడుదలైంది. రంజిత్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కుల్‌భూషణ్ కర్బాందా, జగదీప్, శ్వేతా భరద్వాజ్ ముఖ్యపాత్రల్లో నటించారు.