Anchor Rashmi: రష్మిని కుక్కతో పోల్చిన నెటిజన్.. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన..
Anchor Rashmi: ఇండస్ట్రీలో ఉన్న స్టార్ యాంకర్లలో రష్మి గౌతమ్ పేరు ముందే ఉంటుంది.
Anchor Rashmi: ఇండస్ట్రీలో ఉన్న స్టార్ యాంకర్లలో రష్మి గౌతమ్ పేరు ముందే ఉంటుంది. ఒకవైపు బుల్లితెర మీద టీవీ షో లతో బిజీగా ఉంటూనే మరోవైపు అప్పుడప్పుడు సినిమాలలో కూడా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది రష్మి. ఇండస్ట్రీలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా రష్మి చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన పోస్టులు పెడుతూ చాలా విషయాలు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ఇక రష్మిపై ట్రోల్స్ కూడా ఎప్పుడు వస్తూనే ఉంటాయి. కానీ చాలా వరకు అలాంటి ట్రోల్స్ ని పట్టించుకోని రష్మి గౌతమ్ తాజాగా ఒక నెటిజన్ కు నోరు మూయించేలా సమాధానం ఇచ్చింది. తనను కుక్కతో పోల్చిన ఒక నెటిజన్ కు రష్మి గౌతమ్ గట్టి సమాధానం ఇచ్చి అతని నోరుమూయించింది. వివరాల్లోకి వెళితే, వీధి కుక్కలపై దాడి జరిగిన ఘటన గురించి మాట్లాడుతూ కుక్కలు కూడా ప్రాణులే అని వాటిపై ఇలా దాడులు చేయటం అమానుషమని చెప్పింది రష్మి.
దానికి ఒక నెటిజన్ "ఈ కుక్క రష్మిని కుక్కను కొట్టినట్లు కొట్టాలి" అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఒళ్ళు మండిన రష్మి అతనిపై విరుచుకుపడింది. "తప్పకుండా.. నీ అడ్రస్ పంపించు నేనే అక్కడికి వస్తాను. ఎవరు ఎవరిని కొడతారో అక్కడ చూసుకుందాం. ఇదే నీకు నా చాలెంజ్," అంటూ సవాలు విసిరింది రష్మి. దీంతో ఆ నెటిజన్ సైలెంట్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో అభిమానులు కూడా రష్మికే సపోర్ట్ చేస్తున్నారు. మరోవైపు రష్మి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.