Maharaj: పోస్టర్‌లో 'మహారాజ్'లా ఉన్నాడుగా.. ఆమిర్ ఖాన్ కుమారుడి లుక్ చూస్తే వావ్ అనాల్సిందే.. విడుదల ఎప్పుడంటే?
Maharaj First Poster Release: అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తొలి చిత్రం తొలి పోస్టర్ విడుదలైంది. ఇందులో జునైద్, జైదీప్ అహ్లావత్ లుక్స్ రివీల్ అయ్యాయి.
Maharaj First Poster Release: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ బాలీవుడ్‌ను శాసించేందుకు సిద్ధమయ్యాడు. ఈ స్టార్ కిడ్ కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకుగల కారణం కూడా ఉందండోయ్. ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన ఖాన్‌లలో ఒకరి కుమారుడు బుల్లితెరపైకి రాబోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన టాలెంట్‌తో అందరి మనసులు గెలుచుకున్న తండ్రి తరహాలో కొడుకు కూడా చేస్తాడేమో చూడాలని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ చిత్రం 'మహారాజ్' విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ నటిస్తుండడంతో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ సినిమా తొలి పోస్టర్ విడుదలైంది.
విడుదలైన 'మహారాజ్' ఫస్ట్ పోస్టర్..
'మహారాజ్' ఫస్ట్ పోస్టర్ విడుదలైంది. ఇందులో జునైద్ ఖాన్‌తో పాటు జైదీప్ అహ్లావత్ కూడా కనిపిస్తాడు. పోస్టర్ చూస్తుంటే అద్భుతంగా ఉంది. రెండు భిన్నమైన రూపాలు కనిపిస్తున్నాయి. పోస్టర్‌లో జునైద్ జహాన్ సూటు- బూట్‌లో ఉన్నాడు. అదే సమయంలో, జైదీప్ అహ్లావత్ మహారాజ్‌గా చాలా భిన్నంగా కనిపిస్తున్నాడు. పోస్టర్‌లో ఇద్దరి కళ్లను చూస్తే కథలోని యాక్షన్ అంచనా వేయవచ్చు.
ఈ పోస్టర్‌లో జునైద్ ఖాన్ చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. దీనిపై అభిమానులు కూడా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. జునైద్ లుక్‌ని జనాలు చాలా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో 'ఓ మై గాడ్! జునైద్ ఖాన్ అరంగేట్రం కోసం వేచి ఉండలేను అంటూ కామెంట్ చేశాడు.
సినిమా ఎప్పుడు, ఎక్కడ విడుదలవుతుంది?
జైదీప్ అహ్లావత్, జునైద్ ఖాన్ పోస్టర్‌తోనే ఫేమస్ అయిపోయారు. దీంతో ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు. సినిమా గురించి మాట్లాడితే, ఈ చిత్రం వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించారు. ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 14న విడుదల కానుంది. సినిమాలో ఓ పవర్‌ఫుల్ మనిషికి, నిర్భయ జర్నలిస్టుకు మధ్య జరిగే పోరాటాన్ని చూడొచ్చు.