67th National Film Awards: జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం 'జెర్సీ'
67th National Film Awards: 67వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది కేంద్రం.
67th National Film Awards: 67వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది కేంద్రం. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా జెర్సీ, జాతీయ ఉత్తమ హిందీ సినిమాగా చిచోరే నిలిచాయి. ఉత్తమ కొరియోగ్రఫీలో రాజు సుందరం మహర్షి సినిమాకు గాను అవార్డు అందుకోనున్నారు. అలాగే మలయాళం మూవీ జల్లికట్టుకు ఉత్తమ అవార్డు లభించింది. ఉత్తమ బాలల చిత్రంగా కస్తూరి అవార్డు గెలుచుకుంది.
జెర్సీ, మహర్షిలకు అవార్డుల పంట
* ఉత్తమ తెలుగు చిత్రం- జెర్సీ
* ఉత్తమ ఎడిటర్ - జెర్సీ(నవీన్ నూలీ)
* ఉత్తమ వినోదాత్మక చిత్రం- (మహర్షి)
* ఉత్తమ కొరియోగ్రాఫర్- రాజుసుందరం (మహర్షి)
67వ జాతీయ చలన చిత్ర అవార్డులు
* ఉత్తమ నటుడు: ధనుష్(అసురన్), మనోజ్ బాజ్‌పాయ్(భోంస్లే)
* ఉత్తమ నటి: కంగనా రనౌత్(మణికర్ణిక/పంగా)
* ఉత్తమ దర్శకుడు: బహత్తార్ హూరైన్
* ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి(ది తాష్కెంట్ ఫైల్స్)
* ఉత్తమ సహాయ నటుడు: విజయ్ సేతుపతి(సూపర్ డీలక్స్)
* ఉత్తమ చిత్రం(హిందీ): చిచ్చోరే
* ఉత్తమ చిత్రం(తెలుగు): జెర్సీ
* ఉత్తమ చిత్రం(తమిళం): అసురన్
* ఉత్తమ కొరియోగ్రాఫర్: రాజు సుందరం(మహర్షి)
* ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)
* ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: మరక్కర్ (మలయాళం)
* ఉత్తమ సంగీత దర్శకుడు(పాటలు): డి.ఇమ్మాన్ (విశ్వాసం)
* ఉత్తమ సంగీత దర్శకుడు(నేపథ్య): జ్యేష్టపుత్రో
* ఉత్తమ మేకప్: రంజిత్(హెలెన్)
* ఉత్తమ గాయకుడు: బ్రి.ప్రాక్ (కేసరి-తేరీ మిట్టీ)
* ఉత్తమ గాయని: బర్దో(మరాఠీ)