Parannageevi Movie Review: పరాన్నజీవి రివ్యూ!

Parannageevi Movie Review: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పేరిట ఓ సినిమా తీస్తుండడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు వర్మ వ్యక్తిగత జీవితం

Update: 2020-07-25 14:15 GMT
parannageevi movie review

Parannageevi Movie Review: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పేరిట ఓ సినిమా తీస్తుండడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు వర్మ వ్యక్తిగత జీవితం పైన సెటైరికల్‌గా 'పరాన్నజీవి' అనే పేరుతో ఓ సినిమా తెరకెక్కించారు. దీనికి బిగ్ బాస్' సీజన్ 2 కంటెస్టెంట్ డాక్టర్ నూతన్ నాయుడు దర్శకత్వం వహించగా, 99 థియేటర్ బ్యానర్‌పై సీఎస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాని ఈరోజు (జూలై 25)న శ్రేయాస్ ఈటీ యాప్‌లో రిలీజ్ చేశారు. రూ.100 చెల్లించి ఈ చిత్రాన్ని చూడవచ్చు!

ఇక కథ విషయానికి వచ్చేసరికి కేవలం తన స్వార్ధం కోసం ఎవరిమీదైనా సరే నెగిటివ్ గా సినిమాలు తీయడానికి వెనుకాడని వర్మ గురించి, అంతేకాకుండా అవకాశాల పేరుతో అమ్మాయిలను వాడుకునే వర్మకి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా బుద్ది చెప్పారు అన్నది మిగిలిన కథ..

ఎవరిమీద పడితే వాళ్ళ మీదా నెగిటివ్ గాసినిమాలు చేసి డబ్బులు సొమ్ము చేసుకునే ఓ దర్శకుడికి కౌంటర్ ఇచ్చేందుకే ఈ సినిమాని తీసినట్టుగా అర్ధం అవుతుంది. పవన్ కళ్యాణ్ అంటే వీపరితమైన అభిమానం, రామ్ గోపాల్ వర్మ అంటే కోపం ఉన్న వాళ్ళకి మాత్రం ఈ సినిమా బాగా నచ్చుతుంది. కానీ సగటు ప్రేక్షకుడు చూడాల్సిన సినిమా అయితే కాదనే చెప్పాలి. దాదాపుగా నలబై నిముషాలు ఉన్న ఈ సినిమాలో ఎక్కువ భాగం సన్నివేశాలు వర్మ అమ్మాయిలతో, వోడ్కాతో ఎంజాయ్ చేసినవే. వోడ్కా తాగుతూ నిర్ణయాలు తీసుకున్నవి మాత్రమే కనిపిస్తాయి.

ఇక సినిమా చివర్లో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌గా మాకు విచక్షణ ఉంది. ఎదుటి వారి జీవితాలతో ఆడుకోవడం మా నాయకుడు నేర్పించలేదు. మిమ్మల్ని ఏదైనా చేయాలంటే ఓ క్షణం పట్టదు. కానీ మా విధానం అది కాదు అంటూ పవన్ ఫ్యాన్స్ చెప్పే డైలాగ్స్ తో సినిమా ముగుస్తుంది. ఇక సినిమా మొత్తంలో డైలాగులు బాగున్నాయని చెప్పవచ్చు. సెటైరికల్‌గా వర్మ పైన పంచులు బాగా పేలాయి.

ఇక సినిమాలో అర్జీవీగా మెయిన్ లీడ్ చేసిన షకలక శంకర్ అదరగొట్టాడు. ఆ పాత్రకి వందకి వంద శాతం న్యాయం చేశాడు. అర్జీవీగా హావభావాలు పలికించడంలో సూపర్ అనే చెప్పాలి. ఇక మిగతా నటీనటులు తమ పాత్రల మేరకు ఆకట్టుకున్నారు. ఇక ఇప్పటివరకు ఓ నటుడు గానే పరిచయం ఉన్న నూతన్ నాయుడు దర్శకుడిగా ఆకట్టున్నాడు. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడ కూడా కొత్త దర్శకుడు అనే ఫీలింగ్ రాదు. చాలా తక్కువ టైంలో అవుట్‌పుట్‌ను ప్రేక్షకుడికి అందించడంలో తన ప్రతిభను చూపించాడు.

Tags:    

Similar News