Yashoda Review: 'యశోద' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Yashoda Review: 'యశోద' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Update: 2022-11-11 09:19 GMT

Yashoda Review: ‘యశోద’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

చిత్రం: యశోద

నటీనటులు: సమంత, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు తదితరులు

సంగీతం: మణి శర్మ

సినిమాటోగ్రఫీ: ఎం సుకుమార్

నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్

దర్శకత్వం: హరి - హరీష్

బ్యానర్: శ్రీదేవి మూవీస్

విడుదల తేది: 11/11/2022

ఈ మధ్యనే "పుష్ప" సినిమాలో "ఊ అంటావా ఊ ఊ అంటావా" అనే ఐటమ్ సాంగ్ తో యువతను ఉర్రూతలూగించిన స్టార్ బ్యూటీ సమంత తాజాగా ఇప్పుడు "యశోద" అనే ఒక సీరియస్ యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సరోగసి కాన్సెప్ట్ తో నడిచే ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దర్శక ద్వయం హరి మరియు హరీష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా కూడా ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రం గా తెరకెక్కింది. ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, మురళీ శర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఇవాళ అనగా నవంబర్ 11న థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించిందో చూసేద్దామా..

కథ:

యశోద (సమంత) చెల్లికి ఒక జబ్బు ఉంది అని తెలుస్తుంది, అయితే ఆ జబ్బు నయం అవ్వడానికి చాలా డబ్బులు కావాల్సివస్తుంది. అయితే డబ్బుల కోసం అద్దె గర్భానికి అంగీకరించి ఈవా సరోగసీలోకి వెళ్తుంది యశోద. ఈ సరోగసీ క్లినిక్ ని మధు(వరలక్ష్మీ శరత్ కుమార్) మైంటైన్ చేస్తుంది. అసలు ఈవా అని పేరున్న ఈ సరోగసీ కేంద్రం ఎవరికీ తెలియకుండా నడుస్తుంది అనమాట. అయితే ఈ సరోగసీ పెరుతో లోపల చాలా అన్యాయాలు జరుగుతున్నాయి అని యశోద గ్రహిస్తుంది. ఆ అన్యాయాలని యశోద ఏ రకంగా అడ్డుకుంది, అక్కడ ఉన్న అమ్మాయిల్ని ఎలా కాపాడింది అనేది మిగిలిన కథ.

నటీనటులు:

సమంత నటన ఈ సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. తన పాత్ర కు చాలా లేయర్స్ ఉన్నప్పటికీ సమంత అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా సమంత పడిన కష్టానికి మంచి ప్రతిఫలం గా మంచి ఔట్ పుట్ వచ్చింది. ఇక సినిమా మొత్తాన్ని సమంత తన భుజాల మీద తీసుకెళ్ళింది అనటం లో అతిశయోక్తి లేదు. వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో మంచి పాత్రే దక్కింది. ఇంటెన్స్ పాత్ర లో తన నటనతో మంచి మార్కులు వేయించుకుంది. సమంత మరియు వరలక్ష్మి శరత్ కుమార్ ల మధ్య సన్నివేశాలు కూడా సినిమాకి బాగానే వర్క్ అవుట్ అయ్యాయి. ఉన్ని ముకుందన్ నటన కూడా సినిమాకి బాగానే ప్లస్ అయింది పైగా అతనిది సినిమాలో చాలా కీలక పాత్ర.మురళి కృష్ణ కూడా తమ పాత్రకు బాగానే న్యాయం చేశారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

దర్శక ద్వయం హరి మరియు హరీష్ కథను ఆద్యంతం కట్టిపడేసే లాగా తీయాలని అనుకున్నారు. కానీ సినిమా మొత్తం ఆ సస్పెన్స్ ను క్యారీ చేయలేకపోయినా కథను బాగానే నడిపించారు. స్క్రీన్ ప్లే కూడా చాలా ఆకర్షణీయంగా ఎక్కడా బోర్ కొట్టకుండా బాగానే నడిచింది. ఇక ఇంటర్వల్ సన్నివేశం మరియు క్లైమాక్స్ సీన్స్ సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యాయి. నిర్మాణ విలువలు ఈ సినిమాకు మంచు ప్లస్ పాయింట్ గా మారాయి. మణి శర్మ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకి చాలా బాగా సూట్ అయ్యింది. మణిశర్మ నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలను చాలా బాగా సెట్ అయింది. సినిమాటోగ్రాఫర్ సినిమాకి మంచి కలర్ ఫుల్ విజువల్స్ ను అందించారు. ఎడిటింగ్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది.

బలాలు:

సమంత

వరలక్మి శరత్ కుమార్

యాక్షన్ సీన్స్

బలహీనతలు:

కొన్ని స్లో సన్నివేశాలు

సెకండ్ హాఫ్

సస్పెన్స్ పెద్దగా లేకపోవడం

చివరి మాట:

సినిమా కొంచెం స్లో గానే మొదలయినప్పటికీ తర్వాత తర్వాత కొంచెం వేగం పుంజుకుంది అని చెప్పుకోవచ్చు. మొదటి హాఫ్ చాలా వరకు పాత్రలను పరిచయం చేయడానికి సరిపోతుంది. ఉన్నవి కొన్ని పాత్రలే అయినా వాటికి కథలో చాలా ప్రాధాన్యత ఇచ్చారు డైరెక్టర్. ఇక తన నటనతో సామ్ అందరి దృష్టిని చాలా బాగా ఆకర్షించింది అని చెప్పచ్చు. ఇంటర్వల్ చాలా ఆసక్తిగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో సస్పెన్స్ ఉంచడానికి ట్రై చేసారు, ట్విస్ట్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ కి వెళ్ళినకొద్ది సినిమా యాక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు కొంచెం బోరింగ్ గా అనిపించినప్పటికీ, అప్పుడప్పుడు వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకునేలా ఉన్నాయి ఓవరాల్ గా సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ తో లోడ్ అయిన ఒక యావరేజ్ థ్రిల్లర్ అని చెప్పచ్చు.

బాటమ్ లైన్:

"యశోద" గా సమంత యాక్షన్ తో బాగానే ఆకట్టుకుంది.

Tags:    

Similar News