BRO Review ‘బ్రో’ మూవీ రివ్యూ.. పవన్ ఫ్యాన్స్కు పూనకాలే..

తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న వినోదయ సీతం సినిమాకు తెలుగు రీమేక్‏గా వచ్చిన లేటేస్ట్ చిత్రం బ్రో.

Update: 2023-07-28 07:02 GMT

BRO Review ‘బ్రో’ మూవీ రివ్యూ.. పవన్ ఫ్యాన్స్కు పూనకాలే..

BRO Movie Review

చిత్రం: బ్రో

నటీనటులు: పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌, కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, బ్రహ్మానందం, సుబ్బరాజు తదితరులు

సంగీతం: తమన్‌

సినిమాటోగ్రఫీ: సుజీత్‌ వాసుదేవ్‌

ఎడిటింగ్‌: నవీన్‌ నూలి

రచన: సముద్రఖని, శ్రీవత్సన్‌, విజ్జి

స్క్రీన్‌ప్లే, సంభాషణలు: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌

దర్శకత్వం: సముద్రఖని

విడుదల: 28-07-2023

తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న వినోదయ సీతం సినిమాకు తెలుగు రీమేక్‏గా వచ్చిన లేటేస్ట్ చిత్రం బ్రో. నటుడు కమ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించారు. ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సోషియో ఫాంటసి సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ సినిమా ఈరోజు అడియన్స్ ముందుకు వచ్చింది మరి సినిమా ఎలావుందో రివ్యూ లో తెలుసుకుందాం.

మార్కండేయ అలియాస్ మార్క్ (సాయి ధరమ్ తేజ్) తన తండ్రి మరణంతో కుటుంబ బాధ్యత మార్క్ పై పడుతుంది. ఒక టెక్స్ట్ టైల్ కంపెనీలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తుంటాడు అనుక్షణం తన కంపెనీ కోసమే పనిచేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తన ఫ్యామిలీకి సరిగ్గా టైం కేటాయించడు. ఇలాంటి టైంలో అతనికి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. అందులో అతను మరణిస్తాడు. అప్పుడు అతనికి కుటుంబ బాధ్యతలు గుర్తొస్తాయి. తన తల్లి, సోదరి, సోదరుడు.. ఏమైపోతారో అని అప్పుడు అతనికి గుర్తొస్తుంది. దీంతో అతనికి దర్శనమిచ్చిన టైం(పవన్ కళ్యాణ్) ను కొంత కాలం గడువు ఇస్తే.. తన బాధ్యతలను తీర్చి వస్తానంటాడు.. అయితే తిరిగి మార్క్ బ్రతికి తన బాధ్యతలను నెరవేర్చడా లేదా..?అనేది తెరపైన చూడాల్సిందే.

దేవుడు ‘టైమ్’ అనే పాత్రలో మరోసారి తన మ్యాజిక్ చూపించాడు పవన్. పవన్ పాత్ర మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. పాటల్లో పాతకాలపు పవన్ కళ్యాణ్ ని చూస్తాం. పవన్ కళ్యాణ్ తో పాటు సాయిధరమ్ తేజ్ కూడా తన క్యారెక్టర్ లో చాలా బాగా నటించాడు. ఇక మిగిలిన వారు తమ తమ పాత్రల్లో చక్కగా చేశారు. సినిమాలో హీరోయిన్స్ పాత్రలకు కొంత ప్రాధాన్యమిస్తే బాగుండు అనిపిస్తుంది. సెకండ్ ఆఫ్ లో త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ అందరిని ఆకట్టుకుంటాయి. ఈ సినిమా తమిళ మూవీ వినోదయ సీతమ్ కి రీమేక్ అనే విషయం తెలిసిందే. కానీ దర్శకుడు సముద్రఖని మాత్రం మన తెలుగు సినిమాకు తగ్గట్టుగా చాలా మార్పులు చేసి తెరపై చూపించడంలో సక్సెస్ కొట్టాడు. అలాగే అక్కడక్కడ పొలిటికల్ పంచ్ డైలాగ్స్ పెట్టడం మరో విశేషం.

ఇక టెక్నకల్ టీమ్ విషయానికి వస్తే దర్శకుడు నటుడిగా ఎంత పెద్ద యాక్టరో అలాగే దర్శకత్వంలోకూడా తన ప్రతిభను చూపించారు. తమన్ మ్యూజిక్‌ ఇంతకుముందు సినిమాలను ఆకట్టుకునేలా లేదని అంటున్నారు ప్రేక్షకులు. కథలో చేసిన మార్పుల వల్ల సినిమా తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిందనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ తన నట విశ్వరూపంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు.

Tags:    

Similar News