Live Updates:ఈరోజు (ఆగస్ట్-17) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-17 02:10 GMT
Live Updates - Page 2
2020-08-17 13:37 GMT

పిఎంఏవైఎస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించిన ఎంపీ బండి సంజయ్

వరంగల్ అర్బన్ : కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలోని పిఎంఏవైఎస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించిన ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

నూతన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కొవిడ్-19 ఆస్పత్రిగా మారిస్తే ఎమ్మెల్యేల ఇండ్ల ని ముట్టడిస్తాం

కేంద్ర ప్రభుత్వం 120 కోట్ల ను ఆసుపత్రి నిర్మాణంకు ఖర్చు చేసింది

రాష్ట్ర ప్రభుత్వం వాటా 30 కోట్లు ఇవ్వడంలో తెరాస సర్కార్ విఫలం అయింది

రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి తోనే సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రాలేదు.

కోవిడ్ నివారణకుకు ప్రత్యామ్నాయా మార్గాలు చూడాలి.

మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకరవాలి.

వరంగల్ ప్రజలు సీఎం కేసీఆర్ కు ధవత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

2020-08-17 13:33 GMT

సుల్తాన్ బజార్ లో దోపిడీ

సుల్తాన్ బజార్ లో ఓ వృద్ధురాలిని బెదిరింది బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఆగంతకుడు.

సుల్తాన్ బజార్ ఆర్యకన్య స్కూల్ సమీపంలో ఉన్న ఇంటి వద్దకు బైక్ పై వచ్చిన ఓ ఆగంతకుడు నీళ్ల కోసం ఇంట్లోకి చొరబడి దోపిడీకు యత్నించిన వైనం.

వృద్ధురాలు పోసాని శోభ వంటిపై ఉన్న 13 తులాల బంగార ఆభరణాలను ఎత్తుకెళ్లిన దుండగుడు...

భయాందోళనకు గురైన బాధితురాలు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసున్న పోలీసులు....

2020-08-17 13:32 GMT

త‌డిసి ముద్దయిన ఓరుగ‌ల్లు

వరంగల్ నగరాన్ని ముంచెత్తిన వానలు, వరదల పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా సమీక్షించారు.

అక్కడ చేపట్టిన సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు.

వరంగల్ నగరంలో స్వయంగా పర్యటించి, పరిస్థితిని పర్యవేక్షించి, అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్ మంగళవారం ఉదయం హెలి కాప్టర్లో వరంగల్ వెళతారు.

ఆ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ కూడా వీరితో కలుస్తారు.

మంత్రుల బృందం నగరంలో పర్యటించి, పరిస్థితిని పర్యవేక్షిస్తుంది.

వరంగల్ ఎంజిఎంను సందర్శిస్తారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహిస్తారు.

వానలు, వరదలు, కరోనా పరిస్థితిని సమీక్షిస్తారు. తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకుంటారు.

2020-08-17 13:27 GMT

విదేశీ పత్రికలను అడ్డంగా పెట్టుకుని, ఆర్ఎస్ఎస్, బీజేపీలపై దాడులు: కె కృష్ణసాగర రావు

బీజేపీ మీడియా స్టేట్మెంట్, కె కృష్ణసాగర రావు, ముఖ్య అధికార ప్రతినిధి, బీజేపీ, తెలంగాణ రాష్ట్రం.

రాహుల్ గాంధీ ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాడంటే, ఆయన విదేశీ పత్రికలను అడ్డంగా పెట్టుకుని, ఆర్ఎస్ఎస్, బీజేపీలపై దాడికి దిగుతున్నారు.

పాపం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దీనంగా, దారుణంగా ఉందంటే, ప్రజల నిజమైన సమస్యలను వదిలేసి, పనికిమాలిన అంశాల చుట్టూ తిరుగుతున్నారు. కనీసం ప్రతిపక్ష పార్టీగా కూర్చోపెట్టినా, అక్కడ కూడా ప్రజల నమ్మకాలని నిలబెట్టుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ.

బీజేపీకి గెలుపు సోషల్ మీడియా తేలేదు. మా పార్టీ నాయకత్వం, సిద్ధాంతాలు, నిబద్ధత, మోదీ నాయకత్వంలోని ప్రభుత్వ పనితీరు - ఇవే మాకు అన్ని ఎన్నికల్లోనూ విజయాన్ని సాధించిపెడుతున్నాయి.

రాహుల్ గాంధీ సోషల్ మీడియా వలలో పడ్డారు. బహుశా గత ఎన్నికల్లో కూడా గెలుపు కోసం ఆయన సోషల్ మీడియానే నమ్ముకుని ఉంటారు. లిస్టెడ్ అయిన అంతర్జాతీయ సోషల్ మీడియా కంపెనీలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు నియంత్రిస్తున్నాయని ఆరోపిస్తున్నారంటే, ఆశ్చర్యంలేదు.. పాపం ఆయన తప్పకుండా చాలా చిర్రెత్తిపోయి ఉంటారు. అందుకే ఈ పిల్లచేష్టలు చేస్తున్నారు.

రాహుల్ మరోసారి, తనకు బుద్ధి మాంద్యం ఉందని నిరూపించుకున్నారు.

2020-08-17 13:22 GMT

ప్రాణహిత నదిలో వరద ఉధృతి

కొమురం భీం జిల్లా: ప్రాణహిత నది గూడెం అంతరాష్ట్ర బ్రిడ్జి వరద ఉదృతిని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ రాంబాబు

మత్స్యకారులు ఎవరు నది తీరంలోవేటకు వెళ్ళొద్దని అదేశాలు జారీ చేసిన‌అడిషనల్ కలెక్టర్ 

2020-08-17 13:20 GMT

జోగిపేటలో సివిల్ సప్లయ్ అధికారుల దాడులు

సంగారెడ్డి జిల్లా: జోగిపేటలో రేషన్ బియ్యం కొంటున్న షాప్స్ పై సివిల్ సప్లయ్ అధికారుల దాడులు....

11.5 కింటల్ల రేషన్ బియ్య0 పట్టివేత, రేషన్ బియ్యం కొంటున్న ఐదు దుకాణాలను సీజ్ చేసిన అధికారులు..

2020-08-17 13:18 GMT

HMTV తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

వరంగల్ వరదలతో అతలాకుతలం అయ్యింది.

పట్టించుకోవాల్సిన సీఎం కేసీఆర్ ఫౌంహౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాడు.

వరంగల్ లో 200 ఎల్లా క్రితమే కాకతీయ రాజులు మంచి నగరాన్ని నిర్మించారు,

గొలుసుకట్టు చెరువులను తవ్వించి ఒక్క నీటి చుక్కను కూడా వృధా కనివ్వలేదు.

కేంద్రం స్మార్ట్ సిటీ కింద నిధులు ఇస్తే పక్కదారి పట్టించారు.

నాళాలు కబ్జా చేయడం వల్ల ఈ దుస్థితి వచ్చింది.

సీఎం కేసీఆర్ వచ్చి వరంగల్ లో క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిస్థితులను చక్క దిద్దాలి.

వరంగల్ కి ఇచ్చాన హామీలు అన్ని నెరవేర్చాలి.

రాజకీలకు అతీతంగా సహాయక చర్యలు చేపట్టాలి.

2020-08-17 13:16 GMT

ఆదిలాబాద్ లో కరోనా ఉదృతి

ఆదిలాబాద్ జిల్లాలో‌‌ ఒక్కరోజులో ఇరవై ఏడు కేసులు నమోదు.. ‌

బాదితులను చికిత్స ‌కోసం ఆసుపత్రికి తరలింపు



2020-08-17 13:13 GMT

కొమురం భీం జిల్లాలో కరోనా కలకలం

 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నేడు  8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా పాలనాధికారిసంజయ్ కుమార్ ఝా తెలిపారు.  కాగజ్ నగర్ లో 4 రెబ్బెన లో 1 కెరమెరిలో   1 జైనూర్ లో 1 సర్ సిల్క్ కాలనిలో 1 కేసు నమోదు 


2020-08-17 11:15 GMT

టిఎస్ హైకోర్టు...


ప్రవేశ పరీక్షలు, చివరి సెమిస్టర్ పరీక్షలపై హైకోర్టులో విచారణ...


నీట్, జేఈఈ పరీక్షల వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించిందని తెలిపిన ఏజీ...


సుప్రీంకోర్టులో తదుపరి విచారణ రేపు జరగనుందని పేర్కొన్న ఏజీ, పిటిషనర్లు...


సుప్రీంకోర్టులో పెండింగులో ఉన్నందున ఈ నెల 24న విచారణ చేపడతామన్న హైకోర్టు...


ఈనెల 23లోగా కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం......


Tags:    

Similar News