Live Updates:ఈరోజు (ఆగస్ట్-17) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 17 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-08-17 02:10 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం, 17 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం త్రయోదశి(ఉ. 10-37 వరకు) తదుపరి చతుర్దశి; పుష్యమి నక్షత్రం (తె. 05-34 వరకు) తదుపరి ఆశ్లేష నక్షత్రం, అమృత ఘడియలు ( రా. 11-12 నుంచి 12-47 వరకు), వర్జ్యం (మ.01-38 నుంచి 03-14 వరకు) దుర్ముహూర్తం (మ.12-29 నుంచి 01-19 వరకు తిరిగి మ.03-00 నుంచి 3-50 వరకు) రాహుకాలం (ఉ. 07-30 నుంచి 09-00 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-22

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-08-17 15:50 GMT

నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం గువ్వాలోనిపల్లి వాడేరా బావుల దగ్గర వరి నాట్లకు వెళ్లి వస్తున్న కూలీల ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న 15 మంది కూలీలకు గాయాలు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు

2020-08-17 15:48 GMT

ఏ.రేవంత్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

చారిత్రక నగరం వరంగల్ కనీవినీ ఎరుగని కన్నీటి సంద్రమైంది.

ఫాంహౌస్ లో కూర్చొని తూతూ మంత్రపు సమీక్షలు కాదు...

సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి సహాయ,పునరావాస చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరిగేలా చూడాలి.

2020-08-17 15:45 GMT

బ్రేకింగ్: వనస్థలిపురం ఏసీపీ జైరామ్ ను సస్పెండ్ చేసిన డిజీపీ మహేందర్ రెడ్డి...

అనైతిక చర్యల కు పాల్పడుతున్న ఏసీపీ పై వచ్చిన ఆరోపణలు..

అన్ని పరీశీలించి నేడు సస్పెండ్ చేసిన డిజీపీ.

2020-08-17 15:41 GMT

కొమురం భీం జిల్లా:   కొమురం భీం ప్రాజెక్టు లోకి భారీగా చేరుతున్న వరదనీరు

గరిష్ఠ నీటి మట్టం: 243.000 టీఎంసీ 

పూర్తి స్థాయి నీటినిల్వ 10.393 టీఎంసీ 

ప్రస్తుతం నీటి మట్టం: 241.550 టీఎంసీ 

ప్రస్తుతం నీటినిల్వ: 9.036 టీఎంసీ 

ఇన్ ప్లో 6400 క్యూసెకులు 

రెండు గెట్లను ఎత్తి : 6500 క్యూసెకులు నీటినివదిలిన అదికారులు

2020-08-17 15:32 GMT

రాచకొండ కమిషనరేట్: సినీ నటి మాధవిలతపై కేస్ నమోదు చేసిన రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు...

ఫేస్ బుక్ లో హిందువుల మనోభావాలు దెబ్బతినే విదంగా కామెంట్ పెట్టిందని ఫిర్యాదు..

వనస్థలిపురం కి చెందిన గోపికృష్ణ అనే విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు..

ఫిర్యాదు పై కేసు నమోదు చెలుకున్న రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు..

295-A సెక్షన్ లకింద కేస్ నమోదు చేసిన రాచకొండ సైబర్ క్రైం పోలీసులు...

2020-08-17 14:53 GMT

మెదక్: చిన్న శంకరం పేట మండలం కామారం తాండ శివారులో చిరుతపులి సంచారం గత వారం రోజుల నుండి బోను ఏర్పాటు చేసిన చిక్కని చిరుతపులి భయాందోళనలో స్థానికులు

2020-08-17 14:51 GMT

బ్రేకింగ్ న్యూస్ :

నాగర్ కర్నూల్ జిల్లా : కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం, మొలచింతలపల్లి గ్రామాల మధ్యన ఉన్న ఉడుగుల వాగు ఒక్కసారిగా పెరిగిన ఉదృతం..

పొలాలకు వెళ్లిన రైతులు తాళ్ల సహాయంతో దాటి క్షేమం, వాగులో కొట్టుకుపోయిన ఆవు, గేదెలు .

2020-08-17 14:46 GMT

 హైదరాబాద్: పన్యాల రాజు అనే యువకుడిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ..

ముక్కు ద్వారా కరోనా సోకి ముఖ్యమంత్రి కేసీఆర్ మరణించాడని..గాంధీ హాస్పిటల్ వైద్యులు ధ్రువీకరించారని ఫేస్ బుక్ లో ఫేక్ పోస్ట్ చేసిన పన్యాల రాజు...

మార్ఫింగ్ చేసిన కేసీఆర్ ఫోటో ఉన్న పోస్ట్ ను షేర్ చేసిన రాజు.....

జూన్ 8 వ తేదీన సుమోటో గా కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు...

సౌదీ అరేబియాలో నివసిస్తున్న..జగిత్యాల జిల్లా కు చెందిన రాజు.. 

సౌదీ నుంచి వచ్చిన రాజును ఈ నెల 14 న ముంబై ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్న అధికారులు...

అధికారుల సమాచారంతో అదుపులోకి తీసుకుని.. హైదరాబాద్ తీసుకొచ్చిన పోలీసులు...

జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలింపు.

2020-08-17 13:51 GMT

బ్రేకింగ్: హైదరాబాదులో మరొకసారి భారీగా డ్రగ్స్ రాకెట్ పట్టివేత..

250 కిలోల మత్తుమందు ను స్వాధీనం చేసుకున్న డి ఆర్ ఐ.

మత్తుమందు అయినా ఏపీడ్రున్, కేటమైన్ , మేపిడ్రీన్ స్వాధీనపరుచుకున్న డి ఆర్ ఐ..

ముంబై హైదరాబాదులో ఏకకాలంలో సోదాలు..

హైదరాబాద్ నుంచి ముంబై కి కార్గో బస్సులో మత్తుమందు రవాణా..

కార్గో బస్సు ని చేంజ్ చేసి పట్టుకున్నా డి ఆర్ ఐ..

హైదరాబాద్ లోని ఒక ఫార్మా కంపెనీ లో మత్తు మందు తయారీ.

100 కోట్ల రూపాయల విలువ చేసే మొత్తమును స్వాధీనం చేసుకున్న డి ఆర్ ఐ.

50 కోట్ల విలువ చేసే మత్తుమందు రా మేటరియల్ కూడా స్వాధీనం చేసుకున్న dri..

దేశవ్యాప్తంగా మత్తుమందు ను సరఫరా చేసేందుకు ప్లాన్ చేసిన డ్రగ్ మాఫియా.

2017 లో అరెస్ట్ అయిన డ్రగ్ dealer nu తిరిగి పట్టుకున్న డి ఆర్ ఐ.

2020-08-17 13:44 GMT

హైదరాబాద్: ఆన్ లైన్ గేమ్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న కేసుపై దృష్టి సారించిన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్....

చైనా జాతీయుడితో పాటు మరో ముగ్గురిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ...

మూడు రోజుల క్రితం నలుగురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు....

ప్రపంచ వ్యాప్తంగా నిషేధిత ఆన్లైన్ గేమ్స్ ద్వారా 1100 కోట్ల మోసానికి పాల్పడినట్లు గుర్తించిన సీసీఎస్ పోలీసులు....

ఇదివరకే ఈడీ తో పాటు ఆదాయపు పన్ను శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సీసీఎస్ పోలీసులు.

Tags:    

Similar News