విదేశీ పత్రికలను అడ్డంగా పెట్టుకుని, ఆర్ఎస్ఎస్, బీజేపీలపై దాడులు: కె కృష్ణసాగర రావు

బీజేపీ మీడియా స్టేట్మెంట్, కె కృష్ణసాగర రావు, ముఖ్య అధికార ప్రతినిధి, బీజేపీ, తెలంగాణ రాష్ట్రం.

రాహుల్ గాంధీ ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాడంటే, ఆయన విదేశీ పత్రికలను అడ్డంగా పెట్టుకుని, ఆర్ఎస్ఎస్, బీజేపీలపై దాడికి దిగుతున్నారు.

పాపం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దీనంగా, దారుణంగా ఉందంటే, ప్రజల నిజమైన సమస్యలను వదిలేసి, పనికిమాలిన అంశాల చుట్టూ తిరుగుతున్నారు. కనీసం ప్రతిపక్ష పార్టీగా కూర్చోపెట్టినా, అక్కడ కూడా ప్రజల నమ్మకాలని నిలబెట్టుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ.

బీజేపీకి గెలుపు సోషల్ మీడియా తేలేదు. మా పార్టీ నాయకత్వం, సిద్ధాంతాలు, నిబద్ధత, మోదీ నాయకత్వంలోని ప్రభుత్వ పనితీరు - ఇవే మాకు అన్ని ఎన్నికల్లోనూ విజయాన్ని సాధించిపెడుతున్నాయి.

రాహుల్ గాంధీ సోషల్ మీడియా వలలో పడ్డారు. బహుశా గత ఎన్నికల్లో కూడా గెలుపు కోసం ఆయన సోషల్ మీడియానే నమ్ముకుని ఉంటారు. లిస్టెడ్ అయిన అంతర్జాతీయ సోషల్ మీడియా కంపెనీలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు నియంత్రిస్తున్నాయని ఆరోపిస్తున్నారంటే, ఆశ్చర్యంలేదు.. పాపం ఆయన తప్పకుండా చాలా చిర్రెత్తిపోయి ఉంటారు. అందుకే ఈ పిల్లచేష్టలు చేస్తున్నారు.

రాహుల్ మరోసారి, తనకు బుద్ధి మాంద్యం ఉందని నిరూపించుకున్నారు.

Update: 2020-08-17 13:27 GMT

Linked news