Live Updates:ఈరోజు (ఆగస్ట్-17) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-17 02:10 GMT
Live Updates - Page 3
2020-08-17 11:15 GMT

టీఎస్ హైకోర్టు....

ఖాజాగూడ చెరువులో నిర్మాణాలపై సామాజిక కార్యకర్త లుబ్నా సార్వత్ పిల్ పై హైకోర్టులో విచారణ...

చెరువులు కాపాడకపోతే తెలంగాణ కూడా రాజస్థాన్ లా మారుతుందని హైకోర్టు వ్యాఖ్య....

చెరువులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసిన హైకోర్టు

రంగారెడ్డి జిల్లాలో చెరువుల ఆక్రమనలపై అనేక పిటిషన్లు వస్తున్నాయన్న హైకోర్టు

చెరువులు కబ్జా అవుతుంటే కలెక్టర్ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని హైకోర్టు వ్యాఖ్య

ఎఫ్ టి ఎల్ ఖరారుకు ప్రభుత్వ విధానాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశం

పోలీసుల ప్రమేయం లేకుంటే చెరువుల కబ్జాలు అడ్డుకోవడం కష్టమని అభిప్రాయపడిన హైకోర్టు

చెరువుల పరిరక్షణ కమిటీలో డిఎస్పీ ఉన్నారా లేదా తెలపాలని హైకోర్టు ఆదేశం

సెప్టెంబర్ 6లోగా నివేదిక సమర్పించాలని ఆదేశం, విచారణ 7కి వాయిదా...

2020-08-17 11:15 GMT

టీఎస్ హైకోర్టు.....


కరోనా చికిత్సకు అధిక చార్జీలు వసూలు చేశారని గ్లోబల్ ఆస్పత్రికి డీఎం హెచ్ఓ నోటీసులు


రేపు ఆస్పత్రి రిజిస్టేషన్ పత్రాలు అప్పగించాలని నోటీసులో పేర్కొన్న డీఎంహెచ్ఓ


నోటీసులపై హైకోర్టును ఆశ్రయించిన గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యం


చట్ట విరుద్ధంగా ఆస్పత్రి రిజిస్ట్రేషన్ రద్దుకు నోటీసు ఇచ్చారని గ్లోబల్ ఆస్పత్రి వాదన


తమ వివరణ వినకుండా రిజిస్ట్రేషన్ వెనక్కి ఇవ్వాలనడం చట్ట విరుద్ధమన్న గ్లోబల్ ఆస్పత్రి


గ్లోబల్ ఆస్పత్రి వాదనతో ఏకీభవించిన హైకోర్టు, నోటీసు రద్దు


చట్ట ప్రకారం మళ్ళీ నోటీసు జారీ చేయ వచ్చునన్న హైకోర్టు


2020-08-17 10:03 GMT

మంచిర్యాల శ్రీపాద ఎల్లం‌పల్లి ప్రాజెక్టులోకి బారీగా చేరుతున్న వరదనీరు


బారీ వరదనీరు చేరుతండటంతో అప్రమత్తమైన అదికారులు..


దిగువ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేసిన అదికారులు


ఏక్షణంలోనైనా‌ నీటిని విడుదల చేస్తామని ప్రకటించిన అదికారులు



ప్రస్తుతం నీటిమట్టం 147.36


గరిష్ట నీటిమట్టం148.00 M



ప్రస్తుతం నీటినిల్వ: 18.3972


పూర్తి స్థాయి నీటినిల్వ 20.175 TMC.


ఇన్ ప్లో‌ 62393 c/s


అవుట్ ప్లో : 649 c/s


2020-08-17 10:03 GMT

సంగారెడ్డి జిల్లా


అమీన్పూర్ మారుతి అనాధాశ్రమం


ముగ్గురు నిందితులను విచారణ నిమిత్తం నేరుగా వైద్య పరీక్ష అనంతరం హాస్పిటల్ నుండి మారుతి అనాధ ఆశ్రమమానికి రెండు వాహనాల్లో తీసుకొచ్చిన పోలీస్ లు


2020-08-17 10:02 GMT

వరంగల్ అర్బన్.


వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవ మండపాలకు ఎర్పాటుకు అనుమతి లేదని వరంగల్ పోలీస్ కమిషనర్ ఐజీ పి. ప్రమోద్ కుమార్ తెలిపారు



కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్యా ఈ నెల 22వ తేదీన నిర్వహించుకోనే వినాయకచవితి పండుగ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సామూహిక పూజలతో పాటు, గణేష్ నవరాత్రి ఉత్సవ నిర్వహణకు నెలకొల్పబడే గణేష్ మండలపాల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని.


కావున ప్రజలందరు ఎవరి ఇంటి వద్ద వారే వినాయక చవితి పూజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాల్సి వుంటుందని, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో, ముఖ్యమైన కూడళ్ళలో విగ్రహాల ఏర్పాటు నిషేధమని.


అదే విధంగా మొహర్రం పండుగను సైతం ముస్లిం సోదరులు తమ ఇంటిలోనే నిర్వహించుకోవాలని, కోవిడ్ 19 నేపథ్యంలో పోలీసుల సూచనను పాటించి కరోనా వ్యాధిని నియంత్రించడంలో ప్రజలందరు తమ వంతు భాధ్యతగా పోలీసులకు సహకరించగలరని.


ముఖ్యంగా పోలీసులు ఉత్తుర్వులను అతిక్రమించి గణేష్ మండపాలను ఏర్పాటు చేస్తే సంబంధిత నిర్వహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేశారు.


2020-08-17 10:02 GMT

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:రాష్ట్రంలో అధిక వర్షాలతో జలవిద్యుత్ కేంద్రాలు నడుస్తున్న కారణంగా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 11వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి బ్యాక్ డౌన్.


నేటి నుండి విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసిన కే.టి.పి.పి అధికారులు.


2020-08-17 10:02 GMT

నిజామాబాద్ : జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత.


సొసైటీ ల ఎదుట బారులు తీరిన రైతులు.


ఆర్మూర్ మండలం ఫిప్రి, కమ్మర్ పల్లి మండలం హాస కొత్జూరు లో రైతుల క్యు.


ఒక్కో రైతుకు 2బస్తాల యూరియా మాత్రమే ఇస్తున్న అధికారులు.


యూరియా కొరత పై రైతుల ఆగ్రహం.


2020-08-17 10:01 GMT

టీఎస్ హైకోర్టు...... ఉస్మానియా ఆస్పత్రి పై హైకోర్టులో విచారణ...

ఉస్మానియా ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చెరుకుందని.. రోగులు, డాక్టర్లు, సిబ్బందికి ప్రాణాపాయం ఉందని కోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్..

వర్షాలకు ఆస్పత్రి భవనంలోకి చేరిన నీటి గురించి మీడియా వార్తలు, కథనాలను చూసామన్న చీఫ్ జస్టిస్

కొన్ని వ్యాజ్యాలు పురావస్తు భవనం కూల్చివేయొద్దని, మరికొన్ని కూల్చివేసి కొత్త ఆస్పత్రి భవనం నిర్మించాలని కోరుతున్నాయని వాటిని విభజించి విచారణ జరుపుతామన్న హైకోర్టు..

పురావస్తు భవనాన్ని కూల్చకుండా 26 ఎకరాల స్థలంలో కొత్త భవనాలను నిర్మించవచ్చని కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్ తరపు న్యాయవాది రచనారెడ్డి..

ఎవరుపడితే వారు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసి కోర్టు సమయం వృధా చేస్తున్నారని ఏజీ..

పిటిషనర్ దేబారా 15 ఏళ్ల నుంచి ప్రజాపోరాటంలో పాలుపంచుకుంటున్నారన్న రచనా రెడ్డి..

ఉస్మానియా ఆస్పత్రికి సంబంధించిన అన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యాలను కలిపి విచారిస్తామన్న హైకోర్టు

విచారణ ఈ నెల 24 కు వాయిదా వేసిన సీజే ధర్మాసనం

2020-08-17 05:25 GMT

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి పెరుగుతున్న వరద

నిజామాబాద్: శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఇన్ ఫ్లో 50,045 క్యుసెక్కులు

ఔట్ ఫ్లో 776 క్యూసెక్కులు

పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 1078.3 అడుగులు

నీటి సామర్థ్యం 90 టీఎంసీలు

ప్రస్తుతం 47.949 టిఎంసీలు.

2020-08-17 04:07 GMT

వర్షాలపై కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష.

మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతిభావన్ లో పరిస్థితి ని సమీక్షించనున్న సీఎం.

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

జిల్లాల వారిగా సమాచారం తెలుసుకొని తీసుకోవలసిన చర్యల పై ఆదేశాలు , సూచనలు చేస్తున్నారు.

ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల అక్కడక్కడ ఇబంధికర పరిస్థితులు నెలకొన్నాయి.

రాబోయే మూడు , నాలుగు రోజులు రాష్ట్రంలో భారీ నుండి అతిభారి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

భారీ వర్షాల పై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం ఒంటి గంటకు అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పటు చేశారు.

ఇప్పటికే అన్ని జిల్లాల వ్యాప్తంగా అధికారులను సీఎం అప్రమత్తం చేశారు.

అవసరమైన చోట సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Tags:    

Similar News