తడిసి ముద్దయిన ఓరుగల్లు
వరంగల్ నగరాన్ని ముంచెత్తిన వానలు, వరదల పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా సమీక్షించారు.
అక్కడ చేపట్టిన సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు.
వరంగల్ నగరంలో స్వయంగా పర్యటించి, పరిస్థితిని పర్యవేక్షించి, అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్ మంగళవారం ఉదయం హెలి కాప్టర్లో వరంగల్ వెళతారు.
ఆ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ కూడా వీరితో కలుస్తారు.
మంత్రుల బృందం నగరంలో పర్యటించి, పరిస్థితిని పర్యవేక్షిస్తుంది.
వరంగల్ ఎంజిఎంను సందర్శిస్తారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహిస్తారు.
వానలు, వరదలు, కరోనా పరిస్థితిని సమీక్షిస్తారు. తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకుంటారు.
Update: 2020-08-17 13:32 GMT