Zinc Deficiency: జింకు లోపిస్తే జుట్టు రాలుతుంది.. అందుకే ఈ ఆహారాలు..!

Zinc Deficiency: జింక్ అనేది మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన ఖనిజం.

Update: 2022-10-05 04:16 GMT

Zinc Deficiency: జింకు లోపిస్తే జుట్టు రాలుతుంది.. అందుకే ఈ ఆహారాలు..!

Zinc Deficiency: జింక్ అనేది మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన ఖనిజం. ఇది 300 కంటే ఎక్కువ ఎంజైమ్‌ల పనితీరులో సహాయపడుతుంది. శరీరంలోని అనేక ముఖ్యమైన ప్రక్రియలలో పాల్గొంటుంది. శరీర కణాల పెరుగుదల, మరమ్మత్తులో సహాయపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరం జింక్‌ను నిల్వ చేయదు. కాబట్టి ఈ పోషకాన్ని ప్రతిరోజూ తీసుకోవాలి. జింక్ లోపం వల్ల జుట్టు రాలడం, బరువు తగ్గడం, గాయం మానడం ఆలస్యం కావడం, తరచుగా విరేచనాలు, ఆకలి మందగించడం, మానసిక ఆరోగ్యం బాగాలేకపోవడం వంటివి జరుగుతాయి. అందుకే జింక్ అభించే ఆహారాలని డైట్‌లో చేర్చుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.

1. పాల ఉత్పత్తులు

పాల ఉత్పత్తులలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో జింక్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు రోజూ 2 గ్లాసుల పాలు తాగాలి. అంతే కాకుండా జున్ను తినడం వల్ల కూడా శరీరంలో జింక్ లోపం ఉండదు.

2. విత్తనాలు

విత్తనాలు రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. వీటివల్ల శరీరానికి జింక్ పుష్కలంగా లభిస్తుంది. దీని కోసం గుమ్మడికాయ, నువ్వుల గింజలను తీసుకోవచ్చు. వీటిని తినడం వల్ల అనేక ఇతర పోషకాల లోపం కూడా తీరుతుంది.

3. డ్రై ఫ్రూట్స్‌

డ్రై ఫ్రూట్స్‌ ఆరోగ్యానికి చాలా మంచివి. పైన్ నట్స్, జీడిపప్పు, బాదం వంటి గింజలను తినడం వల్ల జింక్ లభిస్తుంది. వీటి ప్రభావం వేడిగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా తినకూడదు.

4. మాంసం

మాంసం జింక్‌కి గొప్ప మూలం. ముఖ్యంగా రెడ్ మీట్ ఈ అవసరాన్ని తీరుస్తుంది. మాంసం సాధారణంగా ప్రోటీన్, కొవ్వు మిశ్రమం. కానీ దీనిని తినడం వల్ల శరీరంలో జింక్ లోపం ఉండదు.

5. గుడ్లు

సాధారణంగా ప్రోటీన్ అవసరాన్ని తీర్చడానికి గుడ్లని తింటారు. అయితే ఇందులో కొద్దిగా జింక్ కూడా ఉంటుంది. ఇది రోజువారీ అవసరాలకు సరిపోతుంది. అందుకే ఉదయం పూట ఉడకబెట్టిన గుడ్లను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.

Tags:    

Similar News